(Local) Mon, 23 Sep, 2019

సాహో పోస్టర్ తో ఒక సెల్ఫీ......గోల్డెన్ ఛాన్స్..!!

August 27, 2019,   4:51 PM IST
Views: 109
Share on:
సాహో పోస్టర్ తో ఒక సెల్ఫీ......గోల్డెన్ ఛాన్స్..!!

యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ మరియు ప్రమోద్ నిర్మించిన భారీ బడ్జెట్ మూవీ సాహో. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ భారీ ఏక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ దగ్గిర పడుతున్న కొద్దీ అంచనాలు పెంచుకుంటోంది. ఈ శుక్రవారం ఆగష్టు 30న ప్రపంచ వ్యాపతంగా తెలుగు, తమిళ్,హిందీ, మలయాళ బాషలలో విడుదలకి సిద్ధంగా ఉంది. తాజగా సాహో మూవీ టీమ్ ఓ గోల్డెన్ ఛాన్స్ కాంటెస్ట్ ద్వారా రెబల్ స్టార్ ప్రభాస్ ను ఆయన ఫ్యాన్స్ కలిసేలా ఒక అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే దానికోసం డార్లింగ్ ఫ్యాన్స్, ముందుగా సాహో పోస్టర్ తో ఒక సెల్ఫీ దిగి, అలానే ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ట్యాగ్ చేస్తూ తమ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలి. ఆ విధంగా పోస్ట్ చేసిన వారి నుండి ఒకరిని స్వయంగా ప్రభాస్ ఎంపిక చేసి, వారిని తనతో కలిసే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. సాహో టీమ్ ఈ కాంటెస్ట్ ప్రకటించిన వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ అప్పుడే తమ సెల్ఫీ ఫొటోలతో  ఇంస్టాగ్రామ్ లో సందడి చేయడం మొదలెట్టేసారు. 

సంబంధిత వర్గం
"ప్ర‌తి రోజు పండ‌గే".... ఫ‌స్ట్ లుక్
486 రూబిక్ క్యూబ్స్‌తో ఆ హీరో ముఖచిత్రం....డైహార్డ ...
486 రూబిక్ క్యూబ్స్‌తో ఆ హీరో ముఖచిత్రం....డైహార్డ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.