(Local) Wed, 18 Sep, 2019

అస్వస్థతకి గురైన నాగార్జున ..!

August 25, 2019,   12:56 PM IST
Views: 189
Share on:
అస్వస్థతకి గురైన నాగార్జున ..!

కింగ్ నాగార్జున ఆగ‌స్ట్ 29, 2019న 60వ వ‌సంతంలోకి అడుగుపెట్ట‌నున్నారు. 60సంవత్సరాల వయస్సులోనూ ఆయన న‌వ యువ‌కుడిలా ఎంతో ఉత్సాహంతో క‌నిపిస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిగ్ బాస్ సీజ‌న్ 3 కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం నాగ్ అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. ఆయ‌న బ‌ర్త్‌డే ఏర్పాట్ల గురించి చ‌ర్చించేందుకు అభిమానులు ఆయ‌న ఇంటికి వెళ్ల‌గా ఆరోగ్యం స‌రిగా లేని కార‌ణంగా నాగ్ వారితో ఎలాంటి చ‌ర్చ జ‌ర‌ప‌లేద‌ని స‌మాచారం. అయితే నిన్న జ‌రిగిన బిగ్ బాస్ ఎపిసోడ్‌లో ఎంతో యాక్టివ్‌గా క‌నిపించిన నాగార్జున అస్వ‌స్థ‌త‌కి గురైన‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌లో ఎంత వాస్త‌వం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఆ మ‌ధ్య మ‌న్మ‌థుడు 2 ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో నాగార్జున చేతికి చిన్న‌క‌ట్టుతో క‌నిపించారు. ఏమైంద‌ని విలేక‌రులు అడ‌గ‌గా, జిమ్‌లో క‌స‌ర‌త్తులు ఎక్కువ‌గా చేయ‌డం వ‌ల్ల కొంత నొప్పి రావ‌డంతో అలా బ్యాండేజ్ క‌ట్ట‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు. ఏదేమైన నాగార్జున ఈ వ‌య‌స్సులోను ప‌ర్‌ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ త‌న అభిమానుల‌కి ఆద‌ర్శంగా నిల‌స్తుండ‌డం గొప్ప విష‌య‌మనే చెప్పాలి.

సంబంధిత వర్గం
ఇంటి పరిసర ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచుకోండి...నాగార్ ...
ఇంటి పరిసర ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచుకోండి...నాగార్ ...
బాబా మాస్టర్ ని ఏడిపించిన.....అలీ
బాబా మాస్టర్ ని ఏడిపించిన.....అలీ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.