(Local) Tue, 20 Oct, 2020

'రూల‌ర్' లో బాలయ్య న్యూ లుక్‌ రిలీజ్...!

November 17, 2019,   12:47 PM IST
Share on:
'రూల‌ర్' లో బాలయ్య న్యూ లుక్‌ రిలీజ్...!

కేఎస్ ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా నంద‌మూరి బాలయ్య తన 105వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'రూల‌ర్' అనే టైటిల్ తో సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి చిత్రయూనిట్ పోస్టర్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్టర్ లో  బాలయ్య చేతిలో గోల్ఫ్ బ్యాట్ పట్టుకొని , త‌ల‌కి క్యాప్‌, క‌ళ్ళకి అద్దాలతో యంగ్ హీరోలని మించిపోయే లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్య చాలా కసరత్తు చేశాడు. చాలా వరకూ బరువు తగ్గి చాలా స్టైలిష్ గా కనిపించడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ  రూలర్ మూవీలో వేదిక, సోనాలి చౌహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. అంతేకాక నటి భూమిక, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఈ సినిమాకి చిరంతన్ బట్ సంగీతం అందిస్తున్నారు. చాలాకాలం తర్వాత తమ అభిమాన హీరో మూవీ విడుదల కానుండడంతో అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రూలర్ టైటిల్ కూడా హైప్ క్రియేట్ చేస్తోంది. 

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.