(Local) Wed, 20 Oct, 2021

ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ హీరోయిన్‌పై తాజా అప్‌డేట్

November 20, 2019,   6:21 PM IST
Share on:
ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ హీరోయిన్‌పై తాజా అప్‌డేట్

టాలీవుడ్ జక్కన్న బాహుబలి చిత్ర తర్వాత మళ్ళీ తెరమీదకి మల్టీస్టార్రర్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ధర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరంభీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుండగా, తారక్ సరసన హాలీవుడ్ హీరోయన్ ని ఎంపిక చేశారు.

తాజాగా చిత్రయూనిట్ తారక్ కు జోడీగా నటించే హీరోయిన్ ను ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ చిత్రంలో సెకండ్ లీడ్ హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మారిస్ ను సెలెక్ట్ చేశారు. ఈ సినిమాలో ఒలీవియా జెన్నిఫర్ పాత్రలో నటిస్తోంది. దీంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. ఈ మూవీలో మరో ఇద్దరూ హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో మెయిన్ విలన్ గా రే స్టీవెన్సన్ నటిస్తుండగా, మరో ముఖ్య పాత్రలో నటి ఎలిసన్ డూడీ నటిస్తోంది. ఈ సందర్భంగా వీరికి స్వాగతం పలుకుతూ చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

సంబంధిత వర్గం
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.