(Local) Wed, 20 Oct, 2021

రోహిత్ శెట్టికి గీతా గోవిందం వర్క్ ఔట్ అవుతుందా?

October 02, 2019,   11:49 PM IST
Share on:
రోహిత్ శెట్టికి గీతా గోవిందం వర్క్ ఔట్ అవుతుందా?

వెండితెరపై ఏదైనా సినిమా హిట్ అయితే బాషా ఏదైనా సరే ఆ సినిమాను మళ్ళీ రీమేక్ చేసి తెరకెక్కించడానికి చాల మంది ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆలా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ టెంపర్ మూవీని హిందీలో గత ఏడాది సింబా గా రీమేక్ చేసి దర్శకుడు రోహిత్ శెట్టి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రోహిత్ శెట్టి తెలుగులో సూపర్ హిట్ అయిన గీత గోవిందం సినిమా రైట్స్ కొనేసుకున్నాడు. చాలా కామెడీగా సాలిడ్ గా సాగిన గీత గోవిందం సినిమాకి సరిపోయే హీరో హీరోయిన్స్ కోసం రోహిత్ శెట్టి వెతుకుతున్నాడట. తన సినిమాల్లో కామెడీ యాక్షన్ కి ఎక్కువ ఇంపోర్టన్స్ ఇచ్చే దర్శకుడు రోహిత్ శెట్టి.... ఈ గీత గోవిందం సినిమా లో ఎలాంటి యాక్షన్ కి చోటుండదు.. కాబట్టి ఈ సినిమాని రోహిత్ ఏ హీరోతో.. ఎలా హ్యాండిల్ చేస్తడో అనేది చూడాలి. అయితే బాలీవుడ్ లో కొంతమంది మాత్రం ఈ గీత గోవిందం రోహిత్ శెట్టి కోట్లిచ్చి కొనుక్కుని.. మరో నిర్మాణ సంస్థతో సినిమాని నిర్మించినా... డైరెక్షన్స్ చెయ్యకుండా వేరొకరికి అప్పజెబితే... ఆ సినిమా రీమేక్ చెడకుండా ఉంటుందంటున్నారు. రోహిత్ ఎక్కువగా యాక్షన్ కి కామెడీ సినిమాలకు మాత్రమే సరిపోతాడు. గీత గోవిందం లాంటి సాలిడ్ లవ్ స్టోరీ ని అంతే అందమైన కథగా తియ్యలేడని ఫిక్స్ అవుతున్నారు.
 

సంబంధిత వర్గం
ఓ ఇంటివాడైన హీరో విజయ్ దేవరకొండ ...
ఓ ఇంటివాడైన హీరో విజయ్ దేవరకొండ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.