(Local) Fri, 15 Nov, 2019

శ్రీముఖి సిక్స్త్ సెన్స్ నిజమైంది....రోహిణి ఔట్‌!

August 18, 2019,   11:46 PM IST
Share on:
శ్రీముఖి సిక్స్త్ సెన్స్ నిజమైంది....రోహిణి ఔట్‌!

స్కూల్ లో టీచర్ లేషన్స్ చెప్పేటప్పుడు స్టూడెంట్స్ లేషన్ వినకుండా గుసగుసలాడితే ఏం అవుతుంది, ఒకసారి వార్నింగ్ ఇస్తారు మరోసారి క్లాస్ నుండి గెట్ అవుట్ అంటారు అంతే... అదే స్కూల్ లాంటి బిగ్ బాస్ హౌస్ అయితే ఇక్కడ కూడా సేమ్ ముందు వార్నింగ్ తర్వాత పనిష్మెంట్. ప్రతిరోజు బిగ్ బాస్ హౌస్ ఎలా ఉన్న శని, ఆదివారాలు మాత్రమే మంచి ఉత్కంతో ఉంటుంది. ఎందుకంటే శని, ఆదివారాలు ఆ వారం నామినేషన్స్ లో ఉన్నవారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరు బూలితెర ముందే ఉంటారు. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ ఉన్నవారిలో నుండి ఒకరు ఈ రోజు ఇంటి నుండి బయటకి రావడం జరింగింది. ఒకవిధంగా చెప్పాలి అంటే శ్రీముఖి సిక్స్త్ సెన్స్ నిజమైంది. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి బుల్లితెర నటి రోహిణి ఎలిమినేట్‌ అయ్యారు. ఈ వారం శివజ్యోతి, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్‌, రోహిణి ఎలిమినేషన్‌ నామినేషన్స్‌లో ఉండగా..  రోహిణి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున తెలిపారు. 

నాలుగో వారం నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభించినప్పుడు శివజ్యోతి-రోహిణిల్లో ఒకరు నామినేట్‌ అవ్వాల్సిందిగా బిగ్‌బాస్‌ సూచించాడు. అప్పుడు శివజ్యోతి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది.  ఆ వెంటనే రోహిణి సేవ్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించారు. అయితే కన్‌ఫెషన్‌ రూం నుంచి బయటకు వచ్చిన తర్వాత శివజ్యోతి-రోహిణి నామినేషన్‌ ప్రక్రియ గురించి మాట్లాడుకోవడం.. ఇతర ఇంటి సభ్యులకు తెలిసేలా సైగలు చేయడంతో ఈ వారం, వచ్చేవారం ఇద్దరినీ బిగ్‌బాస్‌ నేరుగా నామినేట్‌ చేశాడు. ప్రేక్షకులు ఇచ్చిన ఓట్ల ప్రకారం శివజ్యోతి నామినేషన్స్‌ నుంచి బయట పడగా, రోహిణికి తక్కువ ఓట్లు రావడంతో తను ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జన తెలిపారు. మరోపక్క తదుపరి వారానికీ శివజ్యోతిని బిగ్‌బాస్‌ నామినేట్‌ చేయడంతో ఐదోవారమూ ఇంటి నుంచి బయటకు వెళ్లే వారి జాబితాలో ఉండనున్నారు.
 

సంబంధిత వర్గం
బిగ్ బాస్ పై యాంకర్‌ ఝాన్సీ అసహనం...
బిగ్ బాస్ పై యాంకర్‌ ఝాన్సీ అసహనం...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.