(Local) Sat, 06 Jun, 2020

వరద బాధితులకు తమ వంతు సహాయం అందించిన....బాలీవుడ్ జంట

August 13, 2019,   12:47 PM IST
Share on:
వరద బాధితులకు తమ వంతు సహాయం అందించిన....బాలీవుడ్ జ ...

ఎక్కడైనా ప్రకృతికి సంబందించిన వైపరీత్యాలు జరుగుతున్నపుడు సామాన్య ప్రజానీకంతో పాటు ఒక హోదాలో ఉన్న సెలబ్రిటీస్ కూడా స్పందించడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ బాలీవుడ్ జంట వరద బాధితులకు తమ వంతు సాయం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసందే. దీంతో వరద బాధితులకు అండగా నిలిచేందుకు జెనీలియా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ ముందుకు వచ్చారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. సోమవారం సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను కలిసి చెక్కు అందజేశారు. ఈ నేపథ్యంలో ఫడణవీస్‌ ట్విటర్‌ వేదికగా జెనీలియా, రితేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఫడణవీస్‌ ట్వీట్‌కు రితేష్‌ దేశ్‌ముఖ్ స్పందించారు. ఈ మేరకు రితేష్ ట్వీట్ చేస్తూ.. ‘వరదల కారణంగా గత కొన్ని రోజులుగా మహారాష్ట్రతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలకు సంబంధించిన వార్తలు మా మనసును చలింపజేశాయి. సోమవారం ఉదయం సీఎంను కలసి దేశ్‌ ఫౌండేషన్‌ తరఫున విరాళం అందించాం. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేసి, బాధితులను ఆదుకోవాలని కోరుతున్నా. మనమంతా కలిస్తే ఎంతో సాధించొచ్చు. థాంక్స్‌ దేవేంద్ర ఫడణవీస్‌ జీ’ అని రితేష్‌ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. 

 

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.