(Local) Mon, 16 Sep, 2019

ప్రభాస్ నాది సేమ్ క్యాస్ట్....వర్మ ట్వీట్

August 26, 2019,   2:43 PM IST
Views: 59
Share on:
ప్రభాస్ నాది సేమ్ క్యాస్ట్....వర్మ ట్వీట్

ఆ డైరెక్టర్ పేరు చెప్పగానే టక్కున వి వినిపించే పదం వివాదస్పద దర్శకుడు. వివాదాలను సరికొత్త రీతిలో తెరలేపి సోషల్ మీడియాలో ట్రెండ్ ఎలా అవ్వాలో తెలిసిన స్మార్ట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తాజాగా మరి సరికొత్త వివాదానికి శ్రీకారం చుట్టాడు. అదేంటంటే క్యాస్ట్ ఫీలింగ్ అనే సాంగ్ ప్రోమోని, అలాగే పూర్తి పాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు వర్మ. ఈరోజు ఉదయం తొమ్మిది 26కి ప్రోమో, రేపు తొమ్మిది 27కి పూర్తి సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే అక్కడితో వదిలేస్తే బాగానే ఉండేది కానీ చివర్లో జై సాహో జై ప్రభాస్ అని పేర్కొనడం చర్చకు తావిచ్చింది. ఈ నెల 30న ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ప్రభాస్ కులాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు ఆయన యూట్యూబ్ లో క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ ప్రోమో అంటూ ఓ వీడియో విడుదల చేశారు. అందులో తనకు తన కులమంటే ఇష్టమని, ప్రభాస్ కూడా తన కులం కాబట్టే ఆయన నటించిన సినిమా ‘సాహో’ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నానని వర్మ పేర్కొన్నారు. ‘సాహో’ బంపర్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వర్మ నిర్మిస్తున్న కొత్త సినిమా ’ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ‘. ఈ సినిమాలోని ఓ పాటను ఈనెల 27వ తారీఖు ఉదయం 9గం.27 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
 

సంబంధిత వర్గం
శ్రద్ధా ఖాతాలో రెండు భారీ హిట్స్!!
శ్రద్ధా ఖాతాలో రెండు భారీ హిట్స్!!
యు/ఏ సర్టిఫికెట్ పొందిన ‘సాహో’…..!!
యు/ఏ సర్టిఫికెట్ పొందిన ‘సాహో’…..!!

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.