(Local) Thu, 29 Jul, 2021

విడుదల తేదీ మార్చుకున్న 'సరిలేరు నీకెవ్వరు'

November 22, 2019,   6:57 PM IST
Share on:
విడుదల తేదీ మార్చుకున్న 'సరిలేరు నీకెవ్వరు'

సంక్రాంతి వస్తోంది అంటే ఇళ్ల ముంగిట పెద్ద పెద్ద ముగ్గులు, పాడి పంటలు, కోళ్ల పందేల తో ఎంతో ఉత్సాహంతో సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి సంక్రాంతి పండుగ నాడు బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా జోరు కూడా కోడి పందేల లాగా పోటాపోటీగా ఉండటం చూస్తూనే ఉంటాం. అయితే ఈ సంక్రాంతి కానుకగా ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల అంటే బాక్సాఫీస్ దగ్గర పోటీ తప్పదు. రాబోయే సంక్రాంతికి సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాలతో పోటీపడుతున్నారు. మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’, బన్నీ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు జనవరి 12న విడుదల చేయనున్నట్టు దర్శక, నిర్మాతలు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.

అప్పటి నుండి రిలీజ్ డేట్స్ చేంజ్ అవుతాయనే ప్రచారం జరుగుతోంది. శుక్రవారం ఎట్టకేలకు రిలీజ్ తేదీలు ఖరారు చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ ఒకరోజు మందుగా జనవరి 11న విడుదల కానుండగా, ‘అల వైకుంఠపురములో’ ముందు అనుకున్న జనవరి 12నే రిలీజ్ కానుంది. నిర్మాతలు చినబాబు, అనిల్ సుంకర నిర్మాతల మండలితో చర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చారు. 
ఈ మేరకు ‘యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్’ (ATFPG) ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. 

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
అల్లు అర్జున్ - మహేష్ ల ఒప్పందం క్యాన్సిల్!!
అల్లు అర్జున్ - మహేష్ ల ఒప్పందం క్యాన్సిల్!!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.