(Local) Tue, 27 Oct, 2020

'రియల్ స్టార్' బర్త్ డే...

September 18, 2019,   4:25 PM IST
Share on:
'రియల్ స్టార్' బర్త్ డే...

1989లో 'అనంతన అవంతర' అనే కన్నడ సినిమాలో  ఓ చిన్న పాత్రతో కెరీర్ ప్రారంభించిన ఉపేంద్ర. 1992లో 'తార్లే నాన్ మగ' అనే మూవీతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. శివరాజ్ కుమార్‌తో చేసిన 'ఓం' మూవీతో డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. కాగా ఈ సినిమాను తెలుగులో 'ఓంకారం' పేరుతో ఉపేంద్ర దర్శకత్వంలోనే రాజశేఖర్ హీరోగా రీమేక్ అయ్యింది. కాగా ఉపేంద్ర.. 'A' అనే ఒకే ఒక్క సినిమాతో సౌత్‌ను షేక్ చేసేశాడు. పేరుకి కన్నడ పరిశ్రమకు చెందిన వాడైనా తెలుగు, తమిళ్ వంటి ఇండస్ట్రీలలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. సెప్టెంబర్ 18 ఉపేంద్ర పుట్టినరోజు. నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్ర మార్కే వేరు.. వర్తమానాన్ని ప్రశ్నించడం, భవిష్యత్తుని ఊహించడం, ప్రేక్షకుడి ప్రవర్తనని తెరమీద చూపించడం ఉపేంద్ర స్టైల్.. టెక్నాలజీ పరంగానూ, కాన్సెప్ట్ పరంగానూ, నటన పరంగానూ ఆయన ఎప్పుడూ ప్రయోగాలనే ఇష్టపడతాడు. తెలుగులో  ఉపేంద్ర  'A', 'ఉపేంద్ర', 'కన్యాదానం', 'రా', 'రక్త కన్నీరు', 'ఒకేమాట', 'సూపర్', 'సెల్యూట్', 'ఉపేంద్ర 2', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'ముకుందా మురారి' ఇలా ఎన్నో మూవీస్‌లో యాక్టర్‌గా, డైరెక్టర్‌గా తన మార్క్ చూపించాడు ఉపేంద్ర..

సంబంధిత వర్గం
నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేయబోతున్న.....స్టార ...
నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేయబోతున్న.....స్టార ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.