(Local) Wed, 18 Sep, 2019

సెప్టెంబర్ లో వస్తున్న మాస్ మహారాజ ఫస్ట్ లుక్.....

August 28, 2019,   3:40 PM IST
Views: 79
Share on:
సెప్టెంబర్ లో వస్తున్న మాస్ మహారాజ ఫస్ట్ లుక్.....

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల ప్రీ లుక్ విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, సెప్టెంబ‌ర్ 2న వినాయ‌క చవితి సంద‌ర్భంగా ర‌వితేజ లుక్ రివీల్ చేయ‌నున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించారు. చిత్రాన్ని ఏడాది చివ‌రలో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల ర‌వితేజ యంగ్ లుక్ అంటూ ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అది సినిమాకి సంబంధించిన లుక్ కాద‌ని ద‌ర్శ‌కుడు ఆనంద్  క్లారిటీ ఇచ్చాడు. డిస్కో రాజా చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా న‌టిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త. 

సంబంధిత వర్గం
డిస్కోరాజా ఫస్ట్ లుక్....
డిస్కోరాజా ఫస్ట్ లుక్....
యంగ్ లుక్ తో షాకిస్తున్న మాస్ మ‌హారాజా…!!
యంగ్ లుక్ తో షాకిస్తున్న మాస్ మ‌హారాజా…!!

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.