(Local) Thu, 09 Apr, 2020

ఈ నెల 18న భయపెడతానంటున్న రవిబాబు...

October 07, 2019,   6:57 PM IST
Share on:
ఈ నెల 18న భయపెడతానంటున్న రవిబాబు...

విభిన్న చిత్రాలకి దర్శకత్వం వహించిన రవిబాబు తాజాగా హారర్, థ్రిల్లర్‌ కథాంశంతో దిల్ రాజు సమర్పణలో, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై 'ఆవిరి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో రవిబాబు నటిస్తూ డైరెక్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబందించి ‘ఈ ఇంట్లో రాజ్ కుమార్ రావు అతని ఫ్యామిలీ నివసిస్తుంది. వారితో పాటు ఒక ఆత్మ కూడా ఉంది.. దానిని మీరు కనిపెట్టగలరా’? అంటూ రిలీజ్ చేసిన ‘ఆవిరి’ టీజర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్‌లుక్‌తోనే ఇంప్రెస్ చేసిన రవిబాబు టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచాడు. నేహా చౌహాన్, శ్రీ ముఖ్తా, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రధారులు నటించిన ‘ఆవిరి’ ఆడియన్స్‌ను భయపెట్టడానికి అక్టోబర్ 18న థియేటర్స్‌లోకి రానుంది. 

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
“ఆవిరి” టీజర్...
“ఆవిరి” టీజర్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.