(Local) Thu, 09 Apr, 2020

‘ఆవిరి’ ట్రైలర్….!!

October 11, 2019,   1:14 PM IST
Share on:
‘ఆవిరి’ ట్రైలర్….!!

కామెడీ చిత్రాలనే కాదు..హారర్ సినిమాలను కూడా విభిన్నంగా తెరమీద చూపించగలిగే సత్తా వున్న దర్శకుడు అల్లరి రవిబాబు. 1998 లో టాలీవుడ్ లో ప్రతినాయకుడిగా నట ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత దాదాపు 75 చిత్రాల్లో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రవిబాబు 2002లో అల్లరి మూవీ ద్వారా దర్శకుడిగా మారాడు...అనసూయ, అమరావతి, అవును, అవును 2...వంటి ప‌లు విభిన్న చిత్రాల ద్వారా త‌న‌దైన మార్కుతో తెరకెక్కించిన రవిబాబు తాజాగా థ్రిల్లర్ జానర్ లో దిల్ రాజు సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై రవిబాబు నటిస్తూ దర్శకత్వం వహించిన మూవీ "ఆవిరి". ఈ మూవీలో నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితం రిలీజ్ చేసారు. మున్నీ అనే ఒక చిన్న పాప, తన తల్లితండ్రులకు తెలియకుండా ఇంటి నుండి వెళ్లిపోవాలనుకోవడం, అయితే ఆశ్చర్యకరంగా ఒక ఆత్మ ఆ పాపను వశపరుచుకొని ఇంటినుండి తీసుకెళ్లిపోవడం, ఆ తరువాత ఆ పాప ఎక్కడుందో తల్లితండ్రులు ఏవిధంగా కనిపెట్టారు అనే వినూత్న కథాంశంతో సినిమా తెరకెక్కుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఆకట్టుకునే థ్రిల్లింగ్ మరియు సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ ట్రైలర్, సినిమాపై బాగా అంచనాలు పెంచిందని చెప్పాలి. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ మూవీను నవంబర్ 1 న విడుదల చేయనున్నారు…!!

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ఈ నెల 18న భయపెడతానంటున్న రవిబాబు...
ఈ నెల 18న భయపెడతానంటున్న రవిబాబు...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.