(Local) Mon, 27 Sep, 2021

శర్వానంద్‌ను ఆలా చూడాలనుకున్న....రామ్‌చరణ్

August 12, 2019,   1:24 PM IST
Share on:
శర్వానంద్‌ను ఆలా చూడాలనుకున్న....రామ్‌చరణ్

ఆగష్టు 15న స్వాతంత్రదినోస్తవం నాడు యువ కథానాయకుడు శర్వానంద్ సినిమా 'రణరంగం' విదుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో  కాజల్, కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని U/A సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. తాజాగా ఈ చిత్ర సౌండ్ కట్ ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌండ్ కట్ ట్రైలర్ అద్భుతంగా, టెర్రిఫిక్‌గా వుంది. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌లో శర్వానంద్‌ను మేము ఎలా చూడాలనుకున్నామో అలాగే వున్నాడు.థియేట్రికల్ ట్రైలర్ పర్‌ఫెక్ట్‌గా వుంది. శర్వా నటించిన కో అంటే కోటి నాకు చాలా ఇష్టం. అలాంటి భావోద్వాగాలతో కూడిన చిత్రం మళ్లీ శర్వాకు పడితే బాగుంటుంది అనుకునేవాడిని. రణరంగం సౌండ్ కట్ ట్రైలర్ చూశాక అలాంటి సినిమానే అనిపించింది. ఈ చిత్రంతో దర్శకుడు సుధీర్‌వర్మ తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. చాలా మంచి కథతో రూపొందిన చిత్రమిది. సన్నివేశాల తాలూకు కట్స్ చాలా ఆసక్తికరంగా వున్నాయి. ప్రశాంత్ పిైళ్లె అందించిన నేపథ్య సంగీతం బాగుంది. తప్పకుండా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు
 

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.