(Local) Mon, 27 Sep, 2021

బిగ్ బాస్ రాజ్యంలో నవ్వులు పూయించిన.....రాజ్యమాత

September 02, 2019,   4:04 PM IST
Share on:
బిగ్ బాస్ రాజ్యంలో నవ్వులు పూయించిన.....రాజ్యమాత

తెలుగు బిగ్ బాస్ హౌస్ లో స్పెషల్ ఎపిసోడ్ కి గెస్ట్ వెళ్ళిన రమ్య కృష్ణ చూడగానే హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అందరు షాక్ గురయిన సంగతి తెలిసిందే. కానీ శనివారం ఎపిసోడ్ తో రమ్య కృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన స్టైల్ ఎంతగానో ఆకట్టుకుంది. రమ్య వ్యాఖ్యాతగా ఎవరిని అనుకరించకుండా తనదైన స్టైల్ లో వ్యవహరించిన తీరు ప్రశంసనీయం. కట్ చేస్తే... ఆదివారం ఎపిసోడ్ లో రమ్యకృష్ణ హౌస్ మేట్స్ తో గేమ్ ఆడించారు. సీన్ చేయండి అంతే! అని చెప్పడంతో హౌస్ మేట్స్ ఇరగదీశారు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ హౌస్ లోకి వెళ్లి మరీ హౌస్ మేట్స్ తొ ఒక ఆట ఆడుకున్నారు. అందర్నీ నవ్విస్తూ.. అందరినుంచీ వినోదాన్ని రాబడుతూ.. తాను ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులకు వినోదాల విందును పంచారు రమ్యకృష్ణ. 
పూలకుండీ ఎందుకురా తన్నావ్? మొదటి సీన్ వంతు రవి, అలీ లది. ఇద్దరూ సీతమ్మ వాకిట్లో పూలకుండీ సీన్ చేయాలి. రమ్యకృష్ణ చెప్పిన మరుక్షణం లోనే సీన్ లోకి దూకేశారు ఇద్దరూ. ఇక అప్పటికప్పుడు ఆ సీన్ ని చక్కగా ప్రదర్శించారు. తమ పెర్ఫార్మెన్స్ తో అందర్నీ ఆకట్టుకున్నారు

నా పొలానికి నీళ్ళు పెట్టాలి! అత్తా నీ మొగుడు నీకంటే ఎత్తుగుంటాడా అంటూ మహేష్ విట్టా సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు అయిపోయాడు. రంగమ్మత్తగా మారిపోయింది శివజ్యోతి. ఇక సమంతగా వచ్చేసింది హిమజ. రంగస్థలం లోని నా పొలానికి నీళ్ళేడతావా సీన్ ని ఇరగదీశారు ఈ ముగ్గురూ.. శ్రీముఖి చంద్రముఖి అయిపోయింది.. ఇదీ అసలైన వినోదం అంటే..బాబాభాస్కర్..శ్రీముఖి చంద్రముఖి లోని సీన్ ని ఫన్నీ వేలో మామూలుగా చేయలేదు. హోస్ట్ రమ్యకృష్ణ.. హౌస్ మేట్స్.. వీరితో పాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా కడుపుబ్బ నవ్వుకున్నారు. అప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టుగా ఆ సీన్ ని కామెడీగా మార్చుకున్న బాబా, శ్రీ ఇద్దరూ తమ నటనతో స్కిట్ ని రక్తికట్టించారు. పూర్తి వినోదభరితంగా.. ఈ సీన్ అందర్నీ ఆకట్టుకుంది.
చంద్రముఖిలా మారిన శ్రీముఖి వీరవిహారం చేస్తుంటే.. నువ్ కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఉన్నావ్ అంటూ కామెడీ యాడ్ చేశారు బాబా భాస్కర్. శ్రీముఖి అయితే చంద్రముఖి నిజంగానే పూనినట్టుగా నాట్యంతో వీరవిహారం చేసింది. బాబా భాస్కర్ తన కొరియోగ్రఫీ టాలెంట్‌ను మిక్స్ చేసి సూపర్ అనిపించారు. మొత్తానికి తమ యాక్టింగ్ టాలెంట్‌తో ఇద్దరూ ఇరగదీశారు. 
వితిక,వరుణ్ ఎఫ్2 లో భార్యాభర్తల సీన్, రాహుల్, పునర్నవి ఖుషి నడుము సీన్ లు చేసి కావలసినంత వినోదాన్ని పంచారు. బిగ్ బాస్ షో లో ఇప్పటివరకూ దక్కని వినోదాన్ని అందించారు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రమ్యకృష్ణ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే.. తనదైన ప్రత్యేకతతో  హౌస్ మేట్స్ తొ కలిసిపోయారు. హౌస్ మొత్తం కలియ తిరిగిన ఆమె బెడ్ రూమ్ గలీజుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. అక్కడ ఉన్న షూలు చూసి ఇన్ని షూలా అంటూ ఆశ్చర్యపోయారు. తరువాత హౌస్ మేట్స్ తొ స్పాంటేనియస్ గా పంచ్ లు వేస్తూ గడిపారు. రాహుల్ ని నువ్వు ఇక్కడ వున్నావా భూపాలంలో ఉన్నావా అంటూ వేసిన పంచ్ మొత్తం ఎపిసోడ్ కి హైలైట్. నామినేషన్ లో ఉన్న మహేష్, హిమజ, పునర్నవిలను కాస్త టెన్షన్ పెట్టారు. టీ షర్ట్ ల మీద ఉన్న క్యాప్షన్ లకి బాబా భాస్కర్ వ్యాఖ్యానం అంటూ చిన్న వినోదాల విందు అందించారు. ఎవరూ బయటకు వెళ్లొద్దు.. అందరూ వినాయకచవితి ఎంజాయ్ చేయండి! ఈవారం ఎలిమినేషన్ లో ఉన్న వారిని కాసేపు టెన్షన్ పెట్టిన రమ్యకృష్ణ ఎవరూ ఎలిమినేట్ కావడం లేదని ప్రకటించారు.అందరూ వినాయకచవితిని ఎంజాయ్ చేయాలని చెప్పి, వచ్చేవారం నాగార్జున వచ్చేస్తారంటూ హౌస్ నుంచి వెళ్ళిపోయారు. మొత్తమ్మీద బిగ్ బాస్ మూడో సీజన్ చప్పగా సా...గుతోంది. వినోదం కనిపించడం లేదు. అన్నిటా అంతే! ఇక నాగార్జున లాంటి హోస్ట్ ఉన్నా, బిగ్ బాస్ వారాంతాల్లో పెద్దగా ఆకట్టుకోవడం లేదు అని బాధపడుతున్న ప్రేక్షకులకు ఇదిరా వినోదం అంటే.. అంటూ ఆదివారాన్ని పూర్తి వినోదాల వారంగా మార్చేశారు. సన్ డే ఫన్ డే గా మారిపోయింది. నాగార్జున పుట్టినరోజు వేడుకలని స్పెయిన్ వెళ్లారు. అయన స్థానంలో శనివారం హోస్ట్ గా వచ్చిన రమ్యకృష్ణ మొదటి రోజు కొద్దిగా తడబడ్డారు. కానీ, ఆదివారం బాహుబలి రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.. హౌస్ మేట్స్ తో ఈ సీజన్ లో ఇప్పటివరకూ లేని వినోదాన్ని ఇప్పించారు. ఈ సీజన్ మొత్తానికి హైలైట్ ఎపిసోడ్ గా ఈ ఎపిసోడ్ సాగింది. నిజమైన వినోదాన్ని అందించిన ఈ ఎపిసోడ్ ఇప్పటివరకూ ఈ సీజన్ లో ఉత్తమ ఎపిసోడ్ గా మిగిలిపోయింది. 

సంబంధిత వర్గం
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.