(Local) Mon, 12 Apr, 2021

'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'....వర్మ

November 28, 2019,   2:01 PM IST
Share on:
'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'....వర్మ

టాలీవుడ్ వివాదాల వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’...ఈ మూవీ టైటిల్ రివీల్ చేసినప్పటి నుండి నేటి వరకు సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముట్టుకుంటుండంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ పేరు మార్పుకు సిద్ధపడ్డాడు. తాజాగా వర్మ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ సినిమా పేరును ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మారుస్తున్నట్టు ప్రకటించాడు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఈ సినిమాలో వర్మ తమను అవమానిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పైగా రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా టైటిల్ ఉందని ఆ సామాజిక వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో వర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. 

ఈ టైటిల్ మార్పుతోనే వర్మ రేపు సెన్సార్ బోర్డుకు వెళ్తున్నాడు. మరోవైపు చంద్రబాబు, లోకేష్‌లను కించపరుస్తూ ఈ సినిమా తీశారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే సినిమాకు ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. బయట చూస్తేనేమో సినిమా మీద బోలెడన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. మరి ఈ వివాదాలను దాటుకుని సెన్సార్ ఆమోదం పొంది సినిమా అనుకున్న తేదీకి విడుదల అవుతుందా? వాయిదా పడుతుందా అనేది వేచి చూడాల్సిందే.

సంబంధిత వర్గం
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
ఓ ఇంటివాడైన హీరో విజయ్ దేవరకొండ ...
ఓ ఇంటివాడైన హీరో విజయ్ దేవరకొండ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.