(Local) Mon, 26 Aug, 2019

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సాంగ్ విడుదల....వర్మ

August 09, 2019,   12:56 PM IST
Share on:

రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పగానే ఒకప్పుడు సంచలన డైరెక్టర్ అని గుర్తుకు వచ్చేది, ఇప్పుడు మాత్రం ఆ పేరు వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ నిలిచింది. వర్మ ఏది చెప్పిన సూటిగా చెబుతారని ఎవరికి భయపడరని కొందరి అభిమానుల అభిప్రాయం. ఆ మధ్య వర్మ నిర్మించిన చిత్రం 'లక్ష్మిస్ ఎన్టీఆర్' ఓ పెద్ద దుమారమే రేపింది. తాజాగా మల్లి వర్మ మరో దుమారానికి తెరలేపినటు తెలుస్తోంది. గురువారంనాడు వర్మ తన అధికారిక ట్విట్టర్ లో  ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ మొదటి సాంగ్ ట్రైలర్ విడుదల చేస్తునట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే కొద్దిసేపటి క్రితం రామ్ గోపాల్ వర్మ తెరకెక్కుతున్న చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంలోని టైటిల్ సాంగ్ ను తన యూట్యూబ్ లో విడుదల చేసాడు. ఎప్పడూ వివాదాస్పద మార్గంలోనే వెళ్లే ఆర్జీవీ, ఈసారి కూడా అదే పంథాను ఎంచుకున్నాడు. పాట ప్రారంభంలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఆపై అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని, మాజీ సిఎం చంద్రబాబు, జగన్ ల మధ్య వాగ్వాదాన్ని చూపిస్తూ పాట మొదలైంది. చంద్రబాబు, జగన్ ల వ్యాఖ్యలను కూడా ఈ పాటలో చూపించడం విశేషం. ఇక ఇవే దృశ్యాలు సినిమాలో ఉంటాయో, ఉండవో తెలియదుగానీ, విడుదల కొద్దీ గంటలలోనే యూట్యూబ్ లో 91,520 వ్యూస్ ని సొంతం చేసుకుంటూ ఈ పాట సోషల్ మీడియాలో జెట్ స్వీడన్ లో  దూసుకెళుతోంది. వర్మ విడుదల చేసిన ఈ పాట ప్రస్తుతం ట్రోల్ అవుతుంది. 

సంబంధిత వర్గం

ప్రభాస్ నాది సేమ్ క్యాస్ట్....వర్మ ట్వీట్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.