(Local) Sat, 24 Oct, 2020

'దండం’ సాంగ్‌ రిలీజ్‌....వర్మ

November 28, 2019,   7:36 PM IST
Share on:
'దండం’ సాంగ్‌ రిలీజ్‌....వర్మ

ఎవరు ఎన్ని చెప్పిన, లేక ఎంత వ్యతిరేకత ఎదురైనా టాలీవుడ్ డైరెక్టర్ వర్మ మాత్రం షరా మామూలే అన్నట్టు వివాదాలు సృష్టించడంలో ముందుటుంటాడు. తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మ తెరెకెక్కించిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వాయిదా పడినా సరే వర్మ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మూవీ నుండి కొద్దిసేపటి క్రితం ఓ వీడియో సాంగ్ ను వర్మ విడుదల చేశారు. 'బాబు దండం' అనే పేరుతో సాంగ్ ను రిలీజ్ చేశారు. రామాయణం, మహాభారతంలోని విలన్ పాత్రలను, కన్నింగ్ పాత్రలను ఉదాహరణగా చూపుతూ.. సాంగ్ ను చేశారు. ‘దండం పెడతారు..సలాం కొడతారు..జయహో అంటారు..సెల్యూట్ కొడతారు’ అంటూ సాగే ఈ పాట సెటైరికల్ గా సాగుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. రవిశంకర్ కంపోజ్ చేసిన ఈ పాటను సిరా శ్రీ రాయగా.. ముంబైకి చెందిన గాయని హంసికా అయ్యర్ పాడింది. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలను స్మృశిస్తూ వర్మ తనదైన స్టైల్ లో ఈ పాటను చూపించినట్లు అర్థమవుతోంది. ఈ సాంగ్ నాలుగు పాత్రల చుట్టూ చూపిస్తూ షూట్ చేయడం విశేషం.  
 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.