(Local) Fri, 25 Sep, 2020

బెల్లీ డాన్స్ నేర్చుకుంటున్న అందాల భామ....!

August 08, 2019,   7:09 PM IST
Share on:
బెల్లీ డాన్స్ నేర్చుకుంటున్న అందాల భామ....!

టాలీవుడ్ ఈ మధ్య బాగా వినిపిస్తున్న హీరోయిన్ పేర్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తాజాగా అక్కినేని నాగార్జున, రకుల్ నటించిన చిత్రం “మన్మధుడు 2” రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. దర్శకుడు రాహుల్ రవీంద్ర తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటున్న రకుల్ “సిగరెట్ కాల్చితే తప్పేంటి” అని కొన్ని బోల్డ్ కామెంట్స్ కూడా చేయడం గమనార్హం. ఇక ఆమె నటించిన “దే దే ప్యార్ దే” హిందీ చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకొవటమే కాకుండా బాలీవుడ్ 2019 టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. దీనితో అమ్మడు బాలీవుడ్ అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. కాగా ఇప్పుడు ఆసక్తిరమైన విషయం ఏమిటంటే రకుల్ హిందీలో నటిస్తున్న ఓ చిత్రం కోసం బెల్లీ డాన్స్ నేర్చుకుంటున్నారని సమాచారం. హిందీ చిత్రం “మార్జావాన్” లో నటిస్తున్న రకుల్ ఓ సన్నివేశంలో బెల్లీ డాన్స్ చేయాల్సివుండటంతో ఆ సన్నివేశంలో పర్ఫెక్షన్ కొరకు ఆమె నిపుణుల దగ్గర బెల్లీ డాన్స్ నేర్చుకుంటుందట. ఐతే ఎదో సన్నివేశం కోసం చేశామా, ఐపోయిందా అని కాకుండా పాత్రకొరకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని మరి చేస్తున్న రకుల్ డెడికేషన్ మెచ్చుకోకుండా ఉండలేం.

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.