(Local) Fri, 07 May, 2021

అగ్ర హీరోలకు ఛాలెంజ్ విసిరిన రకుల్....

September 26, 2019,   12:31 PM IST
Share on:
అగ్ర హీరోలకు ఛాలెంజ్ విసిరిన రకుల్....

సెలబ్రిటీస్ తమ గ్లామర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికి తెలిసిన విషయమే...అయితే ఆ అందాన్ని కాపాడుకోవటానికి కూడా జిమ్ లో రకరకాల వర్కౌట్లను చేస్తూ కష్టపడుతుంటారు. అయితే కొందరు చాల ఇష్టంగా ఈ వర్కౌట్లను చేస్తూ ఛాలెంజ్ కూడా విసురుతుంటారు. తాజాగా ఫిట్ నెస్ కి సంబంధించి ఓ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అందరికీ తెలిసిందే. జిమ్ లో తాను చేసిన వర్కౌట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… ఫిట్ నెస్ పట్ల అభిమానుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంటుంది. తాజాగా… ఫిట్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా మేక్ యువర్ మూవ్ ఛాలెంజ్ ను స్వీకరించిన రకుల్… యాంటీ గ్రావిటీ పుషప్స్ చేసింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. బాలీవుడ్ నటి మలైకా అరోరా తనకు విసిరిన ఛాలెంజ్ ను తాను పూర్తి చేశానని… ఇదే ఛాలెంజ్ ను మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, అజయ్ దేవగన్, రానా దగ్గుబాటి, మోహన్ శక్తిలకు విసురుతున్నాని తెలిపింది. వారి ఫిట్ నెట్ మూవ్స్ ను చూపించాలని ఛాలెంజ్ చేసింది.

సంబంధిత వర్గం
చెడు స్పర్శపై అమ్మాయిల్లో అవగాహన కల్పించాలి
చెడు స్పర్శపై అమ్మాయిల్లో అవగాహన కల్పించాలి
మరో బిజినెస్ లోకి దిగిన రకుల్...
మరో బిజినెస్ లోకి దిగిన రకుల్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.