(Local) Sat, 19 Sep, 2020

చైనాలో అత్యధిక త్రీడీ స్క్రీన్లపై ‘2.ఓ’....

August 14, 2019,   5:23 PM IST
Share on:
చైనాలో అత్యధిక  త్రీడీ స్క్రీన్లపై ‘2.ఓ’....

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం రోబో ‘2.O’. ఈ మూవీకి భారత్ లో టాక్ పరంగా నెమ్మదించినా వసూళ్ళ పరంగా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించారు. సెల్ ఫోన్ వాడకంతో ప్రకృతి వినాశనం మొదలవుతోందని ఎన్నో పక్షిజాతులు అంతరించిపోతున్నాయన్న మెసేజ్ తో ఈ మూవీ తెరకెక్కించారు. అప్పట్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజైన చైనాలో మాత్రం రిలీజ్ కాలేదు. ఎప్పటి నుంచో బయ్యర్లు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా పలు కారణాల వలన ఆగింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని జూలై 12నే రిలీజ్ చేయాలని భావించినా, హాలీవుడ్ మూవీ లయన్ కింగ్ విడుదల నేపథ్యంలో వాయిదా చేసిన సంగతి తెలిసిందే. ఇక మళ్ళీ ఇన్నాళ్ళకి డేట్ దొరికింది. రజినీకాంత్ కి భారత్ లోనే కాదు చైనా, జపాన్ లలో కూడా మంచి క్రేజ్ ఉంది. కాగా చైనాలో సెప్టెంబర్ 6న ఈ రోబో చిత్రాన్ని రికార్డుస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం 47,000 కంటే ఎక్కువగా త్రీడీ స్క్రీన్లపై రిలీజ్ అవుతోంది. ఈ రేంజ్ లో చైనాలో రిలీజవుతున్న విదేశీ చిత్రం ఇప్పటివరకు మరొకటి లేదు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ, హెచ్ వై మీడియా సంస్థతో కలిసి 2.ఓ చిత్రాన్ని చైనాలో విడుదల చేస్తోంది.  ఈ చిత్రంలో రజనీకి జోడీగా అమీ జాక్సన్ నటించింది. 

సంబంధిత వర్గం
హాంకాంగ్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు
హాంకాంగ్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.