(Local) Tue, 22 Sep, 2020

సెప్టెంబర్ లో సందడి చేయబోతున్న చిట్టి....

August 17, 2019,   4:27 PM IST
Share on:
సెప్టెంబర్ లో సందడి చేయబోతున్న చిట్టి....

హాలీవుడ్ సినిమా లయన్ కింగ్ రావడంతో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రోబో 2.o  చిత్రం చైనా రిలీజ్ డేట్ పోస్టుపోన్ చేసుకున్న సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ఈ రోబో 2.o ఇండియాలో అంచనాల మేర విజయం సాదించలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు చైనాలో సెప్టెంబర్ 6న దుమ్మురేపడానికి సిద్ధంగా ఉంది. చిట్టి రోబో చైనాలో రికార్డు సృష్టిస్తున్నాడు. అత్యధిక స్క్రీన్లపై విడుదల కాబోతున్న విదేశీ చిత్రంగా చైనాలో రికార్డ్ నెలకొల్పాడు చిట్టీ.  ఈ సినిమాను 47 వేల కంటే ఎక్కువ త్రీడీ స్క్రీన్లపై విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ స్థాయిలో చైనాలో విడుదల కాబోతున్న తొలి విదేశీ చిత్రం ‘2.0’ కావడం గమనార్హం. చైనాలో రజినీకి ఉన్న క్రేజీ దృష్ట్యా ఈ అరుదైన ఫీట్ ను '2.0' సాధించగలింది. లైకా ప్రొడక్షన్స్‌.. హెచ్‌వై మీడియా సంస్థతో కలిసి సినిమాను చైనాలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌  విలన్ గా నటించడం అక్కడ వారికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. అందులోనూ ప్రకృతి ప్రేమికులు ఎక్కువ కాబట్టి ఈ కాన్సెప్ట్ చైనాలో అందరూ లైక్ చేస్తారని, ఖచ్చితంగా సినిమా మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంటుందని అంటున్నారు. అందులోనూ రజనీకాంత్ కి మంచి మార్కెట్ ఉండటం అనేది కలిసొచ్చే అంశంగా కూడా చెప్తున్నారు.
 

సంబంధిత వర్గం
ఇండియన్ 2 ఫస్ట్ లుక్....
ఇండియన్ 2 ఫస్ట్ లుక్....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.