(Local) Sat, 24 Jul, 2021

సూపర్ స్టార్ మెచ్చిన "మాఫియా"....

September 18, 2019,   1:05 PM IST
Share on:
సూపర్ స్టార్ మెచ్చిన

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మాతగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రం "మాఫియా". పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అరుణ్ విజయ్ కథానాయకుడిగా, ప్రియా భవాని హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రసన్న ప్రతినాయకుడి పాత్రలో పోషించారు. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశకు చేరుకున్న నేపథ్యంలో చిత్రయూనిట్ రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. టీజర్ లో అరుణ్ విజయ్ అడవికి రాజు సింగంతో పోలుస్తూ తన క్యారెక్టర్‌ గురించి చెప్తుండగా, ప్రసన్న తన క్యారెక్టర్‌ను హైనాతో కంపేర్ చేస్తూ చెప్పడం టీజర్‌లో హైలెట్ అయ్యింది. అంతేకాక డైరెక్టర్ కార్తీక్ నరేన్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కలిసి చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రజినీ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించాడు. ఆ టీజర్ చూసిన రజినీ చాలా బాగుందంటూ కార్తీక్ నరేన్‌తో పాటు చిత్ర యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు రజినీకాంత్. ఈ విషయాన్ని కార్తీక్ నరేన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. త్వరలో మాఫియా చాప్టర్ - 1 గా విదుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  
 

సంబంధిత వర్గం
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.