(Local) Tue, 10 Dec, 2019

44 ఏళ్ళు దాటినా సూపర్ స్టార్ ఇజం.....!

August 18, 2019,   3:37 PM IST
Share on:
44 ఏళ్ళు దాటినా సూపర్ స్టార్ ఇజం.....!

రజినీకాంత్ ఈ పేరు తమిళనాట మాత్రమే కాదు తెలుగువారికి కి సుపరిచితమే. సూపర్ స్టార్ రజినీ క్రేజ్ కేవలం తమిళనాడులో మాత్రమే కాదు దేశవిదేశాలలో కూడా ఏ మాత్రం తగ్గదనే చెప్పుకోవాలి.  తమిళ సినీ పరిశ్రమ స్థాయిని జాతీయ స్థాయిలోనే కాకుండా భారత దేశం నాలువైపులా పెంచి అందరూ గర్వపడేలా విదేశాల్లో కూడా తన క్రేజ్ ను పెంచుకున్న నటుడు రజినీకాంత్ అలియాస్ శివాజీ రావ్ గైక్వాడ్. మహారాష్ట్ర లో జన్మించిన ఓ కానిస్టేబుల్ కొడుకు బస్ కండక్టర్ నుంచి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తనదైన స్టైల్ తో జోష్ నింపే స్థాయికి వెళ్లాడు. తలైవా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నలభై ఏళ్ళు దాటింది.

1975లో ఆగస్ట్ 18న రిలీజైన అపూర్వ రాగంగల్ తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన రజినీకాంత్ అతి తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ అయ్యాడు. చూస్తుండగానే తన సినిమాలతో రాష్ట్రాలనే కాకుండా దేశం మొత్తంలో తన క్రేజ్ ను పెంచుకున్నాడు. బాషా – ముత్తు – అరుణాచలం – నరసింహా – శివాజీ – రోబో వంటి ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో తలైవా 44 ఇయర్స్ ఆఫ్ రజిని ఇజం కామన్ డిపి వైరల్ అవుతోంది. ప్రస్తుతం రజినీకాంత్ మురగదాస్ డైరెక్షన్ లో దర్బార్ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
 

సంబంధిత వర్గం
సీనియర్‌ హీరోయిన్‌ తో తలైవర్ రొమాన్స్‌..
సీనియర్‌ హీరోయిన్‌ తో తలైవర్ రొమాన్స్‌..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.