(Local) Wed, 24 Jul, 2019

తానా సభలకు నేను వెళ్లడం లేదు... రాజమౌళి

July 04, 2019,   5:42 PM IST
Share on:

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వస్తున్నా ముల్టీస్టార్ సినిమా “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టీయ‌స్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నిక‌ల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న చిత్ర‌మిది. ఇది ఇలా ఉండగా రాజమౌళి తానా సభలకు హాజరయ్యేందుకే అమెరికా వెళ్లారని పలు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా దీనిపై రాజమౌళి స్పందిస్తూ ట్విటర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘ఫ్రెండ్స్‌.. నేను వ్యక్తిగత పని మీద వాషింగ్టన్‌కు వచ్చాను. తానా వేడుకల నిమిత్తం కాదు. నేను ఎలాంటి మ్యూజికల్‌ కార్యక్రమాలకు కూడా హాజరుకాలేను. నేను వస్తానని ఆశించి తీరా రాకపోయేసరికి బాధపడే నా అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ క్లారిటీ ఇవ్వాలనుకున్నాను’ అని పేర్కొన్నారు.

మరోపక్క జక్కన్న కుమారుడు కార్తికేయ ట్విటర్ లో ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని అని వెల్లడించారు. చిత్రీకరణలో భాగంగా ఇటీవల కొన్ని సీక్వెన్స్‌లను తెరకెక్కించామని. వారం రోజుల పాటు చిత్రీకరణకు బ్రేక్‌ ఇచ్చామని పేర్కొన్నారు. ‘ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి. అల్లూరి పాత్రలో రామ్‌చరణ్‌ను లుక్‌ను మీ ముందుకు తీసుకురావడానికి మేమెంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’ అని చిత్రబృందం ట్వీట్‌లో పేర్కొంది.ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ పాత్ర‌లో, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తున్నారు. రెండు నిజ పాత్ర‌ల క‌ల్పిత క‌థాంశమే ఈ చిత్ర‌మని ఇది వ‌ర‌కే రాజ‌మౌళి తెలియ‌జేశారు. ఇద్ద‌రు స్వాతంత్ర స‌మ‌ర‌యోధుల కథ కావ‌డంతో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ని టాక్‌. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.