(Local) Tue, 20 Oct, 2020

మా అబ్బాయిని గెలిపించండి...

November 01, 2019,   1:50 PM IST
Share on:
మా అబ్బాయిని గెలిపించండి...

బుల్లితెరపై రాత్రివేళ ప్రసారమయ్యి అందరిని అలరించే గేమ్ షో బిగ్ బాస్. తెలుగులో రెండు సీజన్ పూర్తి చేసుకొని మూడో సీజన్ నడుస్తోంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ తెలుగు ‘బిగ్‌బాస్‌ సీజన్-3’ వంద రోజులు ముగించుకుంది. ఈ వచ్చేవారమే ఆఖరి వారం. ఎవరు గెలుస్తారు? ఎవరు రన్నరప్.. ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు? ఇదే ఉత్కంఠ ఇప్పుడు బిగ్‌బాస్ ప్రేక్షకుల్లో. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్ ఐదుగురు మాత్రమే ఇంట్లో మిగిలారు ఇప్పుడు. ఈ ఐదుగురిలో ఎవరు టైటిల్ కైవసం చేసుకుంటారు అనే టెన్షన్ నెలకొంది. ప్రధానంగా రాహుల్, శ్రీముఖిల పేర్లే వినిపిస్తున్నాయి. ఓట్లు వేయడానికి రేపు ఆఖరి రోజు. దీంతో అభిమానులు తమతమ ఫేవరెట్‌ కంటెస్టెంట్లకే ఓట్లు వేయండని సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో శ్రీముఖి ‘రాములమ్మ కాంటెస్ట్‌’తో ప్రేక్షకులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. శ్రీముఖి తమ్ముడు, అమ్మానాన్నలు కూడా వీడియోలు వదులుతూ శ్రీముఖిని గెలిపించమని కోరుతున్నారు. మరోపైపు రాహుల్‌ సిప్లిగంజ్‌ కోసం ప్రముఖ సింగర్‌ నోయెల్‌ గట్టి ప్రచారమే చేస్తున్నాడు. ఈ క్రమంలో రాహుల్ తల్లి తన కొడుకు విజయం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్టు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ‘రాహుల్ నిజాయితీ, మంచితనం, ముక్కుసూటితనాన్ని చూసి ఓట్లు వేసి ఇంతవరకు తీసుకువచ్చారు. ఇక బిగ్‌బాస్ ముగియడానికి రెండే రోజులు సమయం ఉంది. మీ ప్రేమను అలాగే  కొనసాగిస్తూ రాహుల్‌కు మరిన్ని ఓట్లు వేసి గెలిపించండి’ అని కోరుకున్నారు ఆమె. ఇంతకుముందు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రాహుల్‌ తల్లి వచ్చారు. ఇంటి సభ్యులతోపాటు ప్రేక్షకుల మనసులనూ గెలుచుకున్నారు. 

కాగా, బిగ్‌బాస్ సీజన్-3 విన్నర్‌గా శ్రీముఖి, రాహుల్ పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు రెండు సీజన్లలో శివబాలాజీ, కౌశల్ గెలిచారు. వారిద్దరు ఆంధ్ర ప్రాంతంవారు అవడంతో ఈసారి తెలంగాణ ప్రాంతం వారికి టైటిల్ కట్టబెట్టాలని బిగ్‌బాస్ యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో కోణంలో చూసుకుంటే రెండు సీజన్లలో మగవారే టైటిల్ గెలిచారు. మరి ఈసారి మహిళ, తెలంగాణ ప్రాంతం నుంచి చూసుకుంటే శ్రీముఖే బెస్ట్ ఛాయిస్‌గా కనిపిస్తోందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఆదివారం చూడాలిమరి బిగ్‌బాస్ సీజన్-3 టైటిల్ విన్నర్ ఎంపిక ఎలా ఉంటుందో? 

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.