(Local) Sun, 25 Oct, 2020

'రాహు' ఫస్ట్ లుక్ రిలీజ్....

August 10, 2019,   3:28 PM IST
Share on:
'రాహు' ఫస్ట్ లుక్ రిలీజ్....

కృతి గార్గ్‌, అభిరామ్‌ వర్మ, కాలకేయ ప్రభాకర్‌, చలాకీ చంటి, గిరిధర్‌, సత్యం రాజేష్‌, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం రాహు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. బ్యాడ్‌ టైమ్‌లో బ్యాడ్‌ ప్లేస్‌లో ఓ అమ్మాయి చిక్కుకుంది. మరి ఆ చిక్కుల్లో నుంచి ఎలా తప్పించుకుంది? అనే కథాంశంతో తెరకెక్కుతోంది ఈ రాహు చిత్రం. ఇప్పటికే ఈ  పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం కొత్త సబ్జెక్ట్‌లతో కొత్త దర్శకులు తెలుగు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇది కూడా అలాంటి ఒక మంచి ప్రయత్నం అవుతుందని దర్శకుడు సుబ్బు అన్నారు. ఈ సినిమా కాన్సెప్ట్‌, నటీనటుల పర్‌ఫార్మెన్స్‌ ప్రేక్షకులను తప్పకుండా ఎంటర్‌టైన్‌ చేస్తుందని చిత్ర నిర్మాతలు ఏ.వి.ఆర్‌. స్వామి, శ్రీశక్తి బాజ్జి, రాజా దేవరకొండ పేర్కొన్నారు. ఇక సుబ్బు న్యూయార్క్‌ యూనివర్సిటీ టిస్చ్‌ ఫిల్మ్‌ స్కూల్‌లో చదువుకున్నారు.

సంబంధిత వర్గం
సెప్టెంబర్ లో వస్తున్న మాస్ మహారాజ ఫస్ట్ లుక్.....
సెప్టెంబర్ లో వస్తున్న మాస్ మహారాజ ఫస్ట్ లుక్.....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.