(Local) Thu, 09 Apr, 2020

యూనివర్సల్ హీరోని కలుసుకున్న పివి.సింధు....

October 11, 2019,   3:57 PM IST
Share on:
యూనివర్సల్ హీరోని కలుసుకున్న పివి.సింధు....

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి వి.సింధు ఇటీవలే స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పి వి.సింధు ప్రముఖ రాజకీయ నాయకులను, ప్రముఖ వ్యక్తులను కలుసుకుంటున్నారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ గెలిచిన పి వి.సింధు రీసెంట్ గా తెలుగు రాష్ట్ర నాయకులను కలుసుకొని వారికి షటిల్ బ్యాట్ ని జ్ఞాపికగా అందజేశారు. తాజాగా నేడు చెన్నైకి వెళ్లిన సింధు యూనివర్సల్ హీరో మక్కల్ నీది మయం అధ్యక్షుడిని కూడా కలుసుకున్నారు. చెన్నైలో మక్కల్ నీది మయం కార్యాలయం లో కమల్ హాసన్ తో భేటీ అయిన సింధూ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కమల్ హాసన్ గారిని కలుసుకోవడానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఫైనల్ గా నేటితో తన కోరిక నెరవేరిందని కమల్ గొప్పతనాన్ని గురించి తెలియజేశారు. కమల్ హాసన్ పివి సింధును సత్కరించి బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గోల్డ్ మెడల్ గెలిచిన సందర్బంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కమల్ చెన్నైలో ప్రతిభావంతులైన పిల్లల కోసం ఒక బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించాలని ప్రపంచ ఛాంపియన్ పి వి సింధును అభ్యర్థించారు. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు రాజకీయాల్లో బిజీ అవుతూనే సినిమా షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. 

సంబంధిత వర్గం
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.