(Local) Mon, 17 Jun, 2019

సైబర్ క్రైమ్ చుట్టూ తిరుగుతున్నా పూరీ

June 08, 2019,   12:46 PM IST
Share on:

తెలుగు ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ శిశ్యుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ దర్శకత్వం లో  ప్రస్తుతం రామ్ హీరోగా ‘ఇ స్మార్ట్ శంకర్’ చిత్రం రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ లో రామ్ ఊరమాస్ డైలాగ్స్,బాడీ లాంగ్వేజ్ కి మంచి స్పందనే వచ్చింది. ఈ స‌మ‌యంలో ఈ చిత్ర యూనిట్‌కు ఊహించని షాక్ ఎదురయింది. ఈ సినిమా  పూర్తి స్క్రిప్ట్ ని  బజ్ బాస్కెట్ గ్రూప్ అడ్మిన్ మురళీ కృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో నిర్మాణ సంస్థలు పూరి జగన్నాథ్ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ తరఫున రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు స్క్రిప్ట్‌ను వెంటనే తొలగించాలని చిత్రయూనిట్  కోరితే.. భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. రామ్ సరసన నాభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ జూలై 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఛార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.