(Local) Sun, 20 Jun, 2021

పాక్ డిమాండ్… దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఐరాస

August 24, 2019,   11:35 AM IST
Share on:
పాక్ డిమాండ్… దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఐరాస

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది . దీనితో జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడింది . ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ అగ్గి మీద గుగ్గిలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఏం చేయాలో ఆర్ధంకాక పలు పిచ్చి చేష్టలు చేస్తోంది. అందులో భాగంగా బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను పాకిస్థాన్ టార్గెట్ చేసింది. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రాను వెంటనే తప్పించాలని పాక్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పాకిస్థాన్ మానవ హక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారీ ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన సంగతి విదితమే. కాశ్మీర్ అంశంతో పాటు పాక్‌పై అణుదాడి చేస్తామన్న భారత్‌కు ప్రియాంక చోప్రా బహిరంగంగా మద్దతు పలికారని మజారీ ఐరాసకు రాసి లేఖలో వివరించారు. శాంతి దూతగా ఉండాల్సిన అర్హత ప్రియాంక చోప్రాకు లేదని ఆరోపించారు. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రియాంక చోప్రా ఐరాస గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి అనర్హురాలని మంత్రి మజారీ ఆరోపించారు. వెంటనే ఆమెను తొలగించాలని కోరారు. బాలాకోట్‌లో భారత ఆర్మీ జరిపిన వైమానిక దాడులను ట్విట్టర్ ద్వారా ప్రియాంక చోప్రా సమర్థించడంతో… అప్పటి నుంచి ఆమెను పాకిస్థాన్ టార్గెట్ చేస్తూ వస్తోంది. దీనిపై ఏకంగా పాక్ మంత్రి ఐరాసకు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి పాక్ కు దిమ్మతిరిగేలా జవాబిచ్చింది. గుడ్ విల్ అంబాసిడర్లు తమ వ్యక్తిగత అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని, తాము ఆందోళన చెందే అంశాలపై నిర్భీతిగా మాట్లాడవచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరాస్ వెల్లడించారు. ప్రియాంక చోప్రా యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా సమర్థంగా వ్యవహరిస్తున్నారని, ఆమె యూనిసెఫ్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసివుంటే మాత్రం పరిగణనలోకి తీసుకునేవాళ్లమని గుటెరాస్ స్పష్టం చేశారు. ప్రియాంక చోప్రా భారత ప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కొన్నినెలల కిందట సర్జికల్ స్ట్రయిక్స్ జరిపినప్పుడు కూడా ‘జైహింద్’ అంటూ ట్వీట్ చేసింది. అప్పటినుంచే ప్రియాంక అంటే పాక్ వర్గాలు గుర్రుగా ఉన్నాయి.

సంబంధిత వర్గం
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.