(Local) Wed, 21 Oct, 2020

గాన కోకిలను కలిసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్...!

August 18, 2019,   11:57 PM IST
Share on:
గాన కోకిలను కలిసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్... ...

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రముఖ గాయని లతామంగేష్కర్ ను కలిశారు. ఈ విషయాన్ని రామ్ నాథ్ కోవింద్ ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. . ముంబైలోని లతా మంగేష్కర్ నివాసానికి వెళ్లి ఆమెను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ తన విషెస్ తెలియజేశానని అన్నారు.

దేశం గర్వించదగిన వ్యక్తి లతా మంగేష్కర్ అని, ఆమె తన మనోహరమై, శ్రావ్యమైన పాటలతో మన జీవితాలను తీపి చేశారని, ఆమె తన నిరాడంబరత, దయతో మనలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారని తన ట్వీట్ లో పేర్కొన్నారు. రామ్ నాథ్ కోవింద్ తమ నివాసానికి రావడంపై లతా మంగేష్కర్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మా ఇంటికి రావడం గౌరవంగా భావిస్తున్నా. సర్‌.. మీరు మేమంతా గర్వపడేలా చేశారు’ అని ఆయనకు తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు.ఆయన దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. 

సంబంధిత వర్గం
నిలకడగా లతామంగేష్కర్ ఆరోగ్యం...
నిలకడగా లతామంగేష్కర్ ఆరోగ్యం...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.