(Local) Wed, 24 Jul, 2019

త్వరలో సాహో సింగల్

July 04, 2019,   12:42 PM IST
Share on:

బాహుబలి తర్వాత ప్రభాస్ ని స్క్రీన్ మీద చూడటం కోసం అభిమానులు కసితో ఎదురుచూస్తున్నా సినిమా “సాహో”. ఈ మధ్యనే విడుదల చేసిన “సాహో” టీజర్ అన్ని భాషల్లోనూ దుమ్ము దులపగా చిత్ర యూనిట్ వారు సాహో ఫస్ట్ సింగిల్ టీజర్ ను విడుదల చేయబోతున్నామని ప్రకటించి ప్రమోషన్స్ జోరు పెంచారు.  అయితే ఈ ఫస్ట్ సింగిల్ కి సంబందించిన వివరాలను ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్‌ను షేర్‌ చేశాడు. అందులో  ‘‘హే డార్లింగ్స్ ... ఇది సాహో మొదటి పాట "ది సైకో సైయాన్" త్వరలో రానుందంటూ..పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరలవుతోంది.

అంతేకాక ఈ సాంగ్ ను బాలీవుడ్ కు చెందిన ప్రముఖ కంపోజర్ “తనిష్క్ బాగ్చి” సమకూరుస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ లో ఈ సంగీత దర్శకుడి ఖాతాలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన పాటలే ఉన్నాయి. 500 మిలియన్ మార్కును అందుకున్న పాటలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఈ పాటపై అంచనాలు ఎక్కువ స్థాయిలోనే పెట్టుకున్నా పెద్ద ఆశ్చర్య పడక్కర్లేదు అనే చెప్పాలి. 300 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలోనే రానంత పెద్ద యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతూ ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 15 విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.  ఇందులో బాలీవుడ్‌కి చెందిన నీల్‌ నితిన్‌ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఎల్విన్‌ శర్మ, చుంకీ, తమిళనాడుకి చెందిన మరో నటుడు విజయ్‌ సేతుపతి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.