(Local) Fri, 22 Oct, 2021

ట్విట్టర్ ఎమోజి సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమా.....

August 23, 2019,   1:19 PM IST
Share on:
ట్విట్టర్ ఎమోజి సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమా ...

వచ్చే వారం సరిగ్గా ఇదే రోజు శుక్రవారం డార్లింగ్ ఫాన్స్ కి పండుగ...ఎందుకంటే ప్రభాస్ నటించిన సాహో విడుదల. దాదాపు 350కోట్ల భారీ బ‌డ్జెట్ తో యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. సాహోకి చిత్రానికి సంబంధించిన బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింద‌ని తెలుస్తుంది. పాత రికార్డుల‌ని తిర‌గ‌రాసేందుకు సాహో టీం సిద్ధం కాగా, తాజాగా ఈ చిత్రం అరుదైన ఘ‌న‌త సాధించింది. ప్ర‌భాస్ గాగుల్స్ పెట్టుకొని ఉన్న లుక్‌ని ట్విట్ట‌ర్‌ ఇమోజీగా విడుద‌ల చేసింది సాహో చిత్ర బృందం. ఇంత వ‌ర‌కు ఏ తెలుగు సినిమాకి సంబంధించి ఇమోజీ విడుద‌ల కాక‌పోగా, ఆ ఘ‌నత సాధించిన తొలి తెలుగు చిత్రం సాహో కావ‌డం విశేషం. చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌నుంది. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. 

సంబంధిత వర్గం
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.