(Local) Tue, 07 Apr, 2020

తెలంగాణాలో ప్రభాస్ సాహో కి చుక్కెదురు....?

August 26, 2019,   1:06 PM IST
Share on:
తెలంగాణాలో ప్రభాస్ సాహో కి చుక్కెదురు....?

ఈ శుక్రవారం ఆగష్టు 30న రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధ కపూర్ నటిస్తున్న చిత్రం సాహో విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మూవీ రిలీజ్ కి సరిగ్గా 4 రోజులు మాత్రమే ఉండటంతో దర్శక నిర్మాతలు ఈ చిత్ర రిలీజ్ పనులతో బిజీ అవుతున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బెనిఫిట్ షోస్‌తో పాటు టిక్కెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు సినిమా నిర్మాతలు విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు అనుమతి దొరికినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదని సమాచారం. బాహుబలి 2’ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సినిమాకు కూడా బెనిఫిట్ షోస్‌తో పాటు టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదని స్పష్టంచేసింది. ఒక్క సినిమాకు టిక్కెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలకు తెలిపింది. ఏపీ ప్రభుత్వం మాత్రం సాహో సినిమా విడుదలైన తర్వాత మొదటి రెండు వారాలపాటు ధియేటర్లలో టికెట్ రేట్లు పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. దీంతో రూ.100 టికెట్ రూ.200కు పెరగనుంది.
 

సంబంధిత వర్గం
తెలంగాణకు ఇండియా టుడే అవార్డు
తెలంగాణకు ఇండియా టుడే అవార్డు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.