(Local) Mon, 27 Sep, 2021

స్టార్ హీరో వీరాభిమాని వీరంగం.....

September 11, 2019,   5:03 PM IST
Share on:
స్టార్ హీరో వీరాభిమాని వీరంగం.....

అభిమానం అనేది దేనిమీద అయిన ఉండవచ్చు కానీ ఆ అభిమానం అనేది హద్దులు దాటి పయనిస్తే అందుకు తగ్గ విపత్కర పరిస్థితులను ఎదురుకోవాల్సి వస్తుంది. అయితే ఈ అభిమానం అనేది సెలెబ్రిటీస్ పైన ఎక్కువుగా చూస్తుంటాం. తాజాగా ఓ సెలెబ్రిటీ పైన అభిమానం పెంచుకున్న ఓ ఫ్యాన్ వీరంగం సృష్టించాడు. వివరాలలోకి వెళితే... టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ వీరాభిమాని ఒకరు కలకలం సృష్టిస్తున్నారు. సెల్ టవర్ ఎక్కి దూకి చచ్చిపోతానంటున్నాడు. తన కోసం ప్రభాస్ వచ్చి తీరాల్సిందేనని,  లేకపోతే చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు. జనగామలోని ఉడముల హాస్పిటల్ వద్ద ఇలా హల్ చల్ చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి నచ్చజెప్పి కిందికి దింపేందుకు యత్నిస్తున్నారు టవర్ ఎక్కిన వీరాభిమానిని మహబూబాబాద్‌కు చెందిన గుగులోతు వెంకన్నగా గుర్తించారు. తనకు ప్రభాస్‌ అంటే చాలా ఇష్టమని,  అతణ్ని ప్రత్యక్షంగా చూడాలని వెంకన్న కోరుతున్నాడు.

సంబంధిత వర్గం
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
సాలీడ్ కలెక్షన్స్ తో దూసుకెళుతున్న 'సాహో'
సాలీడ్ కలెక్షన్స్ తో దూసుకెళుతున్న 'సాహో'

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.