(Local) Sat, 19 Oct, 2019

గోపీచంద్ కొడుకు బర్త్ డే సెలెబ్రేషన్స్....

September 14, 2019,   4:31 PM IST
Share on:
గోపీచంద్ కొడుకు బర్త్ డే సెలెబ్రేషన్స్....

2001లో తొలి వలపు చిత్రం ద్వారా తెలుగు తెరకి హీరోగా పరిచయమైనా తోట్టెంపుడి గోపీచంద్. ఆ తర్వాత ఫ్లూ చిత్రాలలో నటిస్తూ యాక్షన్  స్టార్, మాచో స్టార్ గా పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ  మాచో హీరో 2013 మే నెలలో రేష్మ‌ని వివాహం చేసుకోగా,  వీరిద్దరికి 2014 అక్టోబర్ లో ఒక అబ్బాయి జన్మించాడు. ఆ బాబుకి గోపీచంద్ తండ్రి పేరు కలిసి వచ్చేలా విరాట్‌ కృష్ణ అని పేరు పెట్టారు. ఇక గ‌త ఏడాది వినాయ‌క చ‌వితి రోజున రేష్మ‌ మ‌రో బాబుకి జన్మనివ్వగా  అత‌నికి వియాన్ అనే పేరు పెట్టారు. నిన్న వియాన్ మొద‌టి బ‌ర్త్‌డే సెల‌బ్రేషన్స్ ఘ‌నంగా జ‌ర‌ప‌గా ఈ వేడుక‌కి యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజ‌ర‌య్యారు. వారిద్ద‌రితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. గోపిచంద్ స‌తీమ‌ణి రేష్మ .. శ్రీకాంత్ బంధువు అన్న సంగ‌తి తెలిసిందే. బీటెక్ చ‌దివిన రేష్మా త్రీడీ యానిమేష‌న్, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ల‌పై ప‌ట్టు సాధించింది. ప్ర‌స్తుతం గోపిచంద్ చాణక్య అనే చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ చిత్రం మ‌రికొద్ది రోజుల‌లో విడుద‌ల కానుంది. ఇక బిను సుబ్రమణ్యం అనే కొత్త ద‌ర్శ‌కుడి డైరెక్ష‌న్‌లోను ఓ సినిమా చేస్తున్నాడు గోపిచంద్.

సంబంధిత వర్గం
ఆస్తిని పంచిన అల్లు అరవింద్...
ఆస్తిని పంచిన అల్లు అరవింద్...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.