(Local) Mon, 01 Jun, 2020

ప్రభాస్ ‘సాహో’ ట్రైలర్ విడుదలయింది.....

August 10, 2019,   5:27 PM IST
Share on:
ప్రభాస్ ‘సాహో’ ట్రైలర్ విడుదలయింది.....

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సాహో’ ట్రైలర్ కొద్దీ నిమిషాల ముందు యూవీ క్రియేషన్స్ సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలుగు, తమిళ్, మలయాళం బాషలలో విడుదల చేసింది ఇంకా హిందీ ట్రైలర్ విదుదల కావాల్సి ఉంది. ట్రైలర్ చూస్తుంటే భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో  ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఒళ్లు గగుర్పొ డిచే యాక్షన్ సన్నివేశాలతో చిత్రకరించారని అర్థమవుతోంది... అబ్బురపరిచే సాహస విన్యాసాలు.. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను తలపించే హై టెక్నికల్ వాల్యూస్‌‌తో హై వోల్టేజ్ క్రియేట్ చేసేలా ఈ ట్రైలర్‌ను రూపొందించారు దర్శకుడు సుజీత్. ట్రైలర్ మొదట్లో మొత్తంగా ముంబాయిలో రూ.2000 కోట్లను ఎవరో దొంగలిస్తారు. అది దొంగతనం చేసింది ఎవరు ? ఎవరు చేసారు ? శ్రద్దా కపూర్ ఈ సినిమా అమృతా నాయర్ అనే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ పాత్రలో పరిచయమవుతుంది. ముంబాయిలో దొంగతనం చేసిన వాళ్లను పట్టుకునే పనిలో ఉంటుంది. మరోవైపు ప్రభాస్, శ్రద్దాల కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇక గల్లీలో ఎవరైనా సిక్స్ కొడతాడు. కానీ స్టేడియంలో కొట్టినవాడికే ఓ రేంజ్ ఉంటది అనే డైలాగులు బాగున్నాయి. విజువల్స్ పరంగా ‘సాహో’ హాలీవుడ్ రేంజ్‌లో ఉంది. ఈ సినిమాను ఆగష్టు 30న విడుదల చేస్తున్నారు

సంబంధిత వర్గం
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.