(Local) Sat, 26 Sep, 2020

టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన ....పవన్ కళ్యాణ్

August 16, 2019,   1:57 PM IST
Share on:
టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన ....పవన్ కళ్యాణ్

2018లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగా హీరో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి గా అభిమానులని కనువిందు చేసాడు. ఆ తర్వాత పవన్ సినిమాలకి గుడ్ బై చెప్పి రాజకీయాలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. అయితే పవన్ సినిమాలకి దూరంగా ఉన్నాడు.. సినిమా ఇండస్ట్రీకి కాదు. ఇప్పటికే ఆయన తెలుగు సినిమాలతో తనకున్న అనుబంధాన్ని ఎప్పటికప్పుడు బయట పెట్టుకుంటూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ తన మనసులో ఉన్న భావాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి ఆయన వాయిస్ తెరపై వినిపించబోతోంది. అది కూడా అన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాకు పవన్ వాయిస్ ఓవర్ అందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నయ్య చిరంజీవి పక్కన ఉండగానే తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆవేశంతో చెబుతున్న వాయిస్ ఓవర్ అదిరిపోయింది.

సైరా సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశంలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ రాబోతుందని తెలుస్తోంది. దానికితోడు టీజర్ లోనే పవన్ వాయిస్ ఓవర్ వినిపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆగస్టు 20న సైరా నరసింహా రెడ్డి టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియో సినిమా పై అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్ళింది. ఇప్పుడు టీజర్ విడుదలైన తర్వాత మరింత ఆసక్తి పెరిగి పోవడం ఖాయం. దానికితోడు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. భారతదేశ తొలి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. దాదాపు రెండు వందల కోట్లతో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుందని తెలుస్తోంది

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.