(Local) Mon, 27 Sep, 2021

ప్రముఖ కోలీవుడ్ నటుడు కన్నుమూత..!

November 27, 2019,   6:37 PM IST
Share on:
ప్రముఖ కోలీవుడ్ నటుడు కన్నుమూత..!

తమిళ నటుడు బాలా సింగ్ బుధవారం ఉదయం అనారోగ్యంతో మరణించారు. 1983లో మలుముకలిలే దైవం అనే మలయాళ సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయమయిన బాలా సింగ్ తమిళంలో ఫేమస్ నటుడు. ఆయన నటుడు నాజర్ నటించి, దర్శకత్వం వహించిన 'అవధారం' అనే సినిమా ద్వారా విలన్ గా తమిళ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందారు. పుదుపెట్టై అనే ధనుష్ హీరోగా వచ్చిన సినిమాతోనే బాలా సింగ్ దశ తిరిగింది. అందులో ఆయన నటించిన అన్బు పాత్ర అత్యద్భుతంగా ఉంటుంది. భారతీయుడు, పోతురాజు, ఇవన్, మద్రాస పట్టనం వంటి సినిమాలలో నటించిన ఆయన కెరియర్ మొత్తం 100 సినిమాలు వరకు చేశారు. చనిపోయేముందు అదే సెల్వ రాఘవన్ చివరగా దర్శకత్వం వచించిన ఎన్జీకే సినిమాలో ఒక మంచి పాత్ర పోషించారు.చివరిగా విడుదలైన సినిమా మగాముని. ఆయన ఎక్కువగా సపోర్టింగ్, విలన్ రోల్స్ పోషించారు. 67 ఏళ్లు నిండిన ఆయన చెన్నైలోని విజయ హాస్పిటల్ లో గత కొద్దిరోజులుగా ఫుడ్ పాయిజనింగ్ కి చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించారు.

సంబంధిత వర్గం
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
సినిమా గారడి వల్ల రాష్ట్రానికి లాభం లేదు: సుబ్రహ్మ ...
సినిమా గారడి వల్ల రాష్ట్రానికి లాభం లేదు: సుబ్రహ్మ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.