(Local) Sun, 17 Oct, 2021

'వాల్మీకి' హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల....

August 26, 2019,   12:00 PM IST
Share on:
'వాల్మీకి' హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల....

2014లో ముకుంద చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్ళీ మెగా ప్రిన్స్ వరుణ్ తో కలిసి హరీష్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి చిత్రంలో నటిస్తోంది. ఈ వాల్మీకి చిత్రం తమిళ్ చిత్రం 'జిగర్తాండా' అనే సినిమాకు రిమేక్‌గా వస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తొలిసారిగా గ్యాంగ్ స్టార్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే విడులైన ఈ సినిమాలోని వరుణ్ లుక్, చిత్ర టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక, మెగస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ రిలీజ్ చేసిన చిత్ర బృందం… తాజాగా పూజా హెగ్డే లుక్‌ను రిలీజ్‌ చేసింది. సైకిల్‌పై వెళ్తూ అచ్చం పల్లెటూరి అమ్మాయిగా కనిపింంచిన పూజా లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో శ్రీదేవి‌గా పూజా కనిపించనుంది. ఈ సినిమాలో తమిళ నటుడు అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌‌పై నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది.

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.