(Local) Sat, 24 Jul, 2021

ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

November 25, 2019,   4:26 PM IST
Share on:
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

అల్లు అరవింద్, ఎస్.రాధకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో’. ఈ సినిమాలో లిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా మరొకసారి తెరపై కనిపించబోతున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ తో అభిమానుల అంచనాలు మరింత పెరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ కూడా ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా ఈ సినిమా లొకేషన్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజా హెగ్డే షూటింగ్‌ లోకేషన్‌లో మూవీ టీమ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘ఇది ఒక ఫ్యామిలీ మూవీ. ఇలాంటి గొప్ప నటులతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కానీ సుశాంత్‌, నివేదా పేతురాజ్‌ ఈ ఫొటోలో మిస్‌ అయ్యార’ని పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్‌పై సుశాంత్‌ స్పందించారు. ‘నేను కూడా మీ అందర్ని మిస్‌ అవుతున్నాను’ అని ట్వీట్‌ చేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘అల వైకుంఠపురములో’ విడుదల కానుంది. 

సంబంధిత వర్గం
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
ట్రేండింగ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్....
ట్రేండింగ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.