(Local) Tue, 02 Mar, 2021

మహేష్ భారీ కటౌట్!

November 25, 2019,   2:21 PM IST
Share on:
మహేష్ భారీ కటౌట్!

వెండితెరపై మహేష్ బాబు ని చూస్తున్నంత సేపు ఫాన్స్ విజిల్ వేయకుండా అసలు ఉండలేరు...ఎందుకంటే బొమ్మపై సూపర్ స్టార్ లుక్స్, గెట్ అప్స్ కి అభిమానులే కాదు చూసే ప్రతి ప్రేక్షుకుడికి నచ్చుతాయి అనడంలో సందేహం లేదు...కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా అందులో కటౌట్ కి సెట్టయ్యే స్టిల్స్ చాలానే ఉంటాయి. ప్రస్తుతం చేస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కూడా అలాంటి కటౌట్స్ గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. సంక్రాంతి కి విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా హంగామా మొదలైపోయింది. సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్ హైదరాబాద్ లో సినిమాల అడ్డా.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35MM థియేటర్ వద్ద ఈ 81అడుగుల కటౌట్ ని ఏర్పాటు చేశారు. మహేష్ గత సినిమాలు ఈ థియేటర్స్ లో చాలా రికార్డులు క్రియేట్ చేశాయి. మురారి – అతడు సినిమాలు ఈ థియేటర్ లో 175రోజులకు పైగా ప్రదర్షింపబడ్డాయి. మహేష్ కి సంబందించిన ఏ సినిమా రిలీజ్ అయినా ఈ లొకేషన్ లో కటౌట్ పడాల్సిందే. సరిలేరు నీకెవ్వరు సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. దిల్ రాజు – అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఇటీవల వచ్చిన టీజర్ తో ఒక క్లారిటీ వచ్చేసింది

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
ట్రేండింగ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్....
ట్రేండింగ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.