(Local) Fri, 29 May, 2020

నల్లమలలో యురేనియం రగడ పై స్పందిస్తున్నా టాలీవుడ్ హీరోస్....

September 12, 2019,   3:19 PM IST
Share on:
నల్లమలలో యురేనియం రగడ పై స్పందిస్తున్నా టాలీవుడ్ హ ...

ప్రకృతి వైపరీత్యాల నుండి తప్పించుకోవాలి అంటే ప్రతి ఒక్కరు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే మానవ పరిణామ క్రమంలో అభివృద్ధి కోసం ఎన్నో జీవజాతులు, అడవులు మాయమైపోయాయి. ఇప్పుడా పరిస్థితి దేశంలోనే ఎంతో ప్రత్యేకమైన నల్లమలకు వచ్చిందా అనే అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమలలో ఉద్యమాలు ఉధృతం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ నల్లమల అటవీ పరిక్షణ కోసం టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ‘సేవ్ నల్లమల’ పేరుతో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు.  కొన్ని భవిష్యత్ తరాల ప్రజలు ఇబ్బందులు పడతారని అంటూ ఇటీవల శేఖర్ కమ్ముల, దర్శకుడు వేణు ఉడుగుల,   పవన్ కళ్యాణ్ ముందుకు రాగా తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన మద్దతు తెలిపారు. తాజాగా ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో ’సేవ్ నల్లమల’ అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. 

దీనిపై విజయ్ స్పందిస్తూ యురేనియం తవ్వకాల వల్ల 20 వేల ఎకరాల్లో ఉన్న నల్లమల అడవి ధ్వంసం అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.  ‘ఇప్పటికే మన గాలి,నీరు, పర్యావరణం అంతా కలుషితం అయిపోయింది. సౌకర్యవంతమైన జీవితం కోసం స్వచ్ఛమైన గాలి లేకుండా చేసుకున్నాం. ఇలా ప్రతిసారి పర్యావరణాన్ని ధ్వసం చేస్తూ పోతున్నాం ఇప్పుడు అందులో నల్లమల అడవులు కూడా ఉన్నాయి.యురేనియం కావాలంటే కొనుక్కోవచ్చు.. అడవులను కొనవచ్చా. విద్యుత్ తయారీ కోసం  యురేనియంతో వెలికి తీసే కంటే సౌర విద్యుత్ శక్తిపై అవగాహన పెంచండి. గాలి,నీరు, సరైన ఆహారం లేనప్పుడు మనకు ఇవన్నీ దేనికోసం అంటూ ప్రశ్నించారు.

You have an error in your SQL syntax; check the manual that corresponds to your MySQL server version for the right syntax to use near 'SaveNallamala")," and p.slug!="pawan-vijay-deverakonda-lend-support-to-save-nall' at line 6
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.