(Local) Mon, 28 Sep, 2020

చిత్రపురిలో ఇళ్లు దక్కనివారికి భరోసాగా నిలుస్తా -   పవన్ కళ్యాణ్

September 04, 2019,   4:24 PM IST
Share on:
చిత్రపురిలో ఇళ్లు దక్కనివారికి భరోసాగా నిలుస్తా -  ...

అందరికీ వినోదాన్ని పంచే సినిమాలో భాగమైనవారికి సొంత ఇంటి కల నెరవేరే క్రమంలో చిత్రపురి కాలనీలో ఎదురవుతున్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

చిత్రపురిలో ఇళ్లు దక్కక వేదనకు లోనవుతున్నవారికి భరోసాగా ఉండి, వారి గొంతుకనవుతానని హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఎన్.శంకర్ , పరుచూరి వెంకటేశ్వర రావు , తమ్మారెడ్డి భరద్వాజ తో  చర్చించనున్నట్టు ఆయన  చెప్పారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో చిత్రపురి సాధన సమితి సభ్యులు పవన్ కళ్యాణ్  కలిశారు. జూనియర్ ఆర్టిస్టులుగా, కాస్ట్యూమర్లుగా, ఫైటర్లుగా... ఇలా సినిమా రంగంలోని 24 క్రాఫ్ట్స్ లో పని చేస్తున్న తమకు ఇళ్లు దక్కడం లేదనీ, చిత్ర పరిశ్రమకు సంబంధం లేని వారికి ఫ్లాట్స్ దక్కుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  

ఈ విషయమై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ "తెలుగు చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది.హిందీ సినిమాకు ముంబయి కేంద్రం  అయినట్టు - మన తెలుగు భాషకు సంబంధించి ఏ యాసలో తీసినా హైదరాబాద్ కేంద్రం అవుతుంది. తెలుగు సినిమా రంగంలోనివారు సొంత ఇంటి కల తీరాలి. ఒక పక్షి కూడా చిన్న గూడు కట్టుకునేందుకు తపిస్తుంది. అలాగే సినీ కార్మికులు కూడా తమ పిల్లలకు ఇల్లు ఇవ్వాలనుకొంటారు. చిత్రపురిలో ఇళ్లకు సంబంధించి మీకు భరోసాగా నిలుస్తాను. దీనిపై చిత్ర పరిశ్రమలోని వారితో మాట్లాడతాను. పార్టీపరంగా మీకు అందుబాటులో శంకర్ గౌడ్,  మహేందర్ రెడ్డి ఉంటారు" అన్నారు.

సంబంధిత వర్గం
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.