(Local) Fri, 23 Jul, 2021

వార్ పై సైరా పైచేయి..

October 03, 2019,   7:25 PM IST
Share on:
వార్ పై సైరా పైచేయి..

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు. కానీ బాలీవుడ్ లో తెలుగు సినిమాలకి కొంచం ఆదరణ తక్కువే అని చెప్పాలి. కానీ రాజమౌళి బాహుబలి తర్వాత బాలీవుడ్ లో కూడా తెలుగు సినిమాలకి హావ బాగా పెరిగింది. సైరా మేకర్స్ వార్ సినిమా పోటీతో కాస్త టెంక్షన్స్ పడ్డారు. ఎందుకంటే వార్ ప్రొడ్యూసర్స్ యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు 'వార్' మూవీ కోసం బాలీవుడ్ మొత్తంలో ఎక్కువ థియేటర్స్ బ్లాక్ చేసేసి సైరా కి తక్కువ థియేటర్స్ వదిలారు. అయితే తాజాగా సైరాకి పోటీగా విడుదలైన వార్ సినిమాకి అనుకున్నంత పాజిటివ్ టాక్ పడలేదు. ఇక సైరా నరసింహారెడ్డి కి తెలుగులోనే కాదు, హిందీలోనూ పాజిటివ్ రివ్యూస్ పడ్డాయి. వార్ సినిమాకి క్రిటిక్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా పాజిటివ్ టాక్ ఇవ్వలేదు. ఈ సినిమా అంతా యాక్షన్ తో నిండిపోయి.. కాస్త ట్విస్ట్ లతో కూడుకుని ఉన్నప్పటికీ... వార్ సినిమా ధూమ్, రేస్ సీరిస్ ల వలె ఉందంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇది సైరా కి ప్లస్ గా మారింది.

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.