(Local) Mon, 16 Sep, 2019

గ్లోబల్ స్టార్ ను టార్గెట్ చేసిన పాకిస్తాన్....ఐక్యరాజ్యసమితికి లేఖ

August 22, 2019,   12:39 PM IST
Views: 75
Share on:
గ్లోబల్ స్టార్ ను టార్గెట్ చేసిన పాకిస్తాన్....ఐక్ ...

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో పాకిస్థాన్ ఎక్కడలేని అక్కసు వెళ్లగక్కుతోంది. కాగా పాకిస్థాన్ మరోసారి తన ఒంకర బుద్ధిని చాటుకుంది. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా భారత్ ను దోషిగా నిలబెట్టాలన్న పాకిస్తాన్ కు గట్టిదెబ్బ తగిలింది. ఈ విషయంపై ప్రపంచ దేశాల మద్దతు లభించకపోవడంతో ఏకాకి అయిన పాక్… ఏదో ఒక విషయంలో ఇండియాపై బురదజల్లె ప్రయత్న చేస్తోంది. తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌ పదవి నుంచి ప్రియాంకను తొలగించాలని పాక్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ మానవ హక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారీ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. కశ్మీర్ అంశంతో పాటు పాక్‌పై అణుదాడి చేస్తామన్న భారత్‌కు ప్రియాంక చోప్రా బహిరంగంగా మద్దతు పలికారని మజారీ లేఖలో పేర్కొన్నారు. ఐరాస నిబంధనలకు ఆమె విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, శాంతి దూతగా ఉండాల్సిన అర్హత ప్రియాంక చోప్రాకు లేదని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం కశ్మీర్‌ ప్రజల హక్కులను కాలరాస్తోందని, అలాంటి ప్రభుత్వానికి ప్రియాంక చోప్రా ఎలా మద్దతు పలుకుతారని ప్రశ్నించారు. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రియాంక చోప్రా ఐరాస గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి అనర్హురాలని,  వెంటనే ఆమెను తొలగించాలని పాక్ మంత్రి లేఖలో పేర్కొన్నారు.

కొద్దిరోజుల క్రిత్రం బాలాకోట్‌లో భారత ఆర్మీ జరిపిన వైమానిక దాడులను ట్విట్టర్ ద్వారా ప్రియాంక చోప్రా సమర్థించినప్పటి నుంచి ఆమెను పాకిస్థాన్ టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇదిలా ఉండ‌గా, ఇదే విష‌యానికి సంబంధించిన ఓ ప్ర‌శ్న ప్రియాంక చోప్రాకు ఎదురైంది. అమెరికాలో ఏర్పాటు చేసిన ఓ ప్ర‌యివేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్రియాంక చోప్రాను పాక్ మ‌హిళ ప్ర‌శ్నించింది. ఒక దేశానికి మ‌ద్ద‌తు తెలుపుతూ మాట్లాడిన మీరు ఐక్య రాజ్య‌స‌మితి అంబాసిడ‌ర్‌గా అర్హుల‌ని అనుకుంటున్నారా..? అని ప్ర‌శ్నించ‌గా, ఆ వెంట‌నే త‌న మాట‌లు ఎవ‌రిరైనా బాధించి ఉంటే క్ష‌మించ‌మంటూ ముందు నేను ఒక ఇండియన్ అంటూ దురుసుగా ప్రవర్తించిన పాక్ యువతికి ప్రియాంక చోప్రా గట్టిగానే సమాధానం ఇచ్చి నోరుమూయించింది.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
నేనే కశ్మీర్‌లో పర్యటిస్తా : జస్టిస్ గొగోయ్
నేనే కశ్మీర్‌లో పర్యటిస్తా : జస్టిస్ గొగోయ్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.