(Local) Wed, 20 Oct, 2021

పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ

November 24, 2019,   9:19 PM IST
Share on:
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అల.. వైకుంఠపురములో. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రంకి సంబంధించి మూడు పాట‌లు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. తొలి సాంగ్‌గా థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా అనే సాంగ్ విడుద‌ల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట మ్యూజిక్ ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించ‌డ‌మే కాక ప‌లు రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు దాయాది దేశం పాకిస్తాన్‌లోను ఈ సాంగ్‌పై చ‌ర్చ జ‌రుగుతుంది. పాకిస్తాన్‌కి చెందిన ముగ్గురు వ్య‌క్తులు ఈ సాంగ్‌పై డిబెట్ నిర్వ‌హించారు. భాష అర్ధం కాక‌పోయిన మ్యూజిక్ మాత్రం విన‌సొంపుగా ఉందంటూ వారు ప్ర‌శంసలు కురిపించారు. అల్లు అర్జున్, పూజా హెగ్డేల గురించి కొంత సేపు చ‌ర్చించి ఆ త‌ర్వాత బన్నీ నటించిన ‘సరైనోడు’ సినిమా గురించి కూడా మాట్లాడారు. చివ‌ర‌గా ఈ వీడియోని పాకిస్థానీయులు త‌ప్ప‌క చూడండని తెలిపారు. బ‌న్నీ సాంగ్‌కి పాకిస్తాన్‌లోను ఇంత రెస్పాన్స్ వ‌స్తుండ‌డంతో బ‌న్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
 

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ టీజర్ అవుట్....
‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ టీజర్ అవుట్....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.