(Local) Mon, 23 Sep, 2019

ఇండియన్ సినిమా సీడీల‌ని బ్యాన్ చేస్తున్న పాక్....

August 16, 2019,   5:20 PM IST
Views: 98
Share on:
ఇండియన్ సినిమా సీడీల‌ని బ్యాన్ చేస్తున్న పాక్....

మోదీ ప్ర‌భుత్తం ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసి క‌శ్మీర్‌కి ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి కల్పించడంతో పాక్ కి ఏం చేయాలో తెలియక కింద మీద పడి ఏడుస్తోందన్న సంగతి తెలిసిందే.  కాగా పాకిస్తాన్ భారత్‌తో ఉండే సంబంధాలను తెంచుకుంటూ పోతోంది. దౌత్య, వాణిజ్య సంబంధాల తో పాటు వినోద రంగాన్ని  తెగదెంపులు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను నిలిపివేసిన పాక్.. ఆ తర్వాత ఢిల్లీ-లాహోర్ మధ్య నడిచే బస్సు సేవలను కూడా నిలిపివేసింది. అంతేకాక గగనతలంలో భారత విమానాలు వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించిన పాక్.. ఇప్పుడు ఎంటర్‌టైన్మెంట్ మీదా ఫోకస్ చేసింది.  తాజాగా ఇండియ‌న్ సినిమాల‌కి సంబంధించిన సీడీలని సీజ్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంది. ఇవే కాక‌ భారతీయ కళాకారులు మరియు భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించే ప్రకటనలను ప్రసారం చేయడాన్ని నిషేదించే నిర్ణ‌యాన్ని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పెమ్రా) తీసుకుంది. ఈ విష‌యాన్ని డాన్ న్యూస్ పేప‌ర్ తెలిపింది. ప్ర‌ధాని అసిస్టెంట్ ఫిర్ధోష్ ఆషిఖ్ అవాన్ శుక్ర‌వారం ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని ప‌త్రిక‌లో ప్ర‌చురించారు. 'భారత అడ్వర్టైజ్మెంట్‌లు, భారత సినిమాలు అమ్మే సిడీ షాపులు అన్నింటినీ బ్యాన్ చేశాం' అని తెలిపారు. ఆగష్టు 14న పెమ్రా నుంచి లేఖ అందుకోగానే ఇస్లామాబాద్‌లో ఉన్న సిడీ షాపులను మూయించేశారు.  ఆమె నిర్ణ‌యంతో డెటాల్ సోప్‌, స‌ర్ఫ్ ఎక్సెల్ పౌడ‌ర్, ప్యాంటీన్ షాంపూ, హెడ్ అండ్ షోల్డ‌ర్స్ షాంపూ. లైఫ్ బాయ్ షాంపూ, ఫాగ్ బాడీ స్ప్రే,స‌న్ సిల్క్ షాంపూ, నార్ నూడిల్స్‌, ఫెయిర్ అండ్ ల‌వ్‌లీ ఫేస్ వాష్‌, సేఫ్ గార్డ్ సోప్ త‌దిత‌ర ఉత్ప‌త్తులు పాక్‌లో నిషేదించ‌బ‌డ్డ‌ట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వర్గం
ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదు: కిషన్ రెడ్డి
ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదు: కిషన్ రెడ్డి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.