(Local) Thu, 16 Jul, 2020

పహిల్వాన్ నుండి జ్యూక్ బాక్స్ విడుదల....

August 28, 2019,   4:36 PM IST
Share on:
పహిల్వాన్ నుండి జ్యూక్ బాక్స్ విడుదల....

శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్‌ హీరోగా, ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా ఎస్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పహిల్వాన్.  ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ పహిల్వాన్  చిత్రాన్ని RRR మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై స్వప్న కృష్ణ నిర్మించారు. ఇప్పటికే ఈ పహిల్వాన్ మూవీ నుండి ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్‌కి మంచి స్పందన లభిచింది. రీసెంట్‌గా చిత్ర యూనిట్ పహిల్వాన్ నుండి జ్యూక్ బాక్స్ రిలీజ్ చేశారు. ఈ ఆల్బమ్‌‌లో మొత్తం ఏడు పాటలున్నాయి. అన్ని పాటలకూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.

'జైహో పహిల్వాన్' సాంగ్‌తో ఆల్బమ్ స్టార్ట్ అవుతుంది. ఈ పాటను సాయి చరణ్ భాస్కరుని, సాకేత్ కోమండూరి కలిసి పాడారు. 'యోధుడా' పాటను విజయ్ ప్రకాష్, సిద్ధార్థ్ బాసూర్ పాడారు. 'ఫైర్ బ్రాండూ' సాంగ్ రేవంత్ పాడగా.. 'ప్రేమ కాలం' పాటను శ్రీ కృష్ణ, రమ్య బెహరా, రాహుల్ నంబియార్ పాడారు. అనురాగ్ కులకర్ణి 'ధృవతార', సంజిత్ హెగ్డే 'కన్నెపిచ్చుక', వ్యాస్ రాజ్ 'వచ్చాడయ్యో పహిల్వాన్' పాటలను పాడారు.  వీటితో పాటు 'మాంగళ్య', 'స్టంట్ థీమ్స్' కూడా ఉన్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ్, మళయాలం భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. 

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.