(Local) Sun, 20 Jun, 2021

డేట్ మార్చుకున్న 'డిస్కోరాజా'...

November 08, 2019,   2:24 PM IST
Share on:
డేట్ మార్చుకున్న 'డిస్కోరాజా'...

ఎస్.ఆర్.టి. బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మాణంలో వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఈ చిత్రంలో మాస్ మహారాజా సరసన నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా ప్రతినాయకుడి  పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ‘డిస్కోరాజా' చిత్రయూనిట్ సోషల్ మీడియాలో మూవీ రిలీజ్ డేట్ గురించి అప్డేట్ ఇచ్చింది. అయితే ముందుగా అనుకున్నట్టు డిసెంబర్ 20న కాకుండా 2020 జనవరి 24 డిస్కోరాజా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు దర్శక, నిర్మాతలు తెలిపారు. జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ ఎక్కువుగా ఉండటంతో, ఎక్కడా కాంప్రమైస్ కాకుండా క్వాలిటీ అవుట్ పుట్ కోసమే డిస్కోరాజాను డిసెంబర్ 20 నుంచి జనవరి 24కి వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత రామ్ తళ్లూరి, దర్శకుడు వి ఐ ఆనంద్ తెలిపారు. ‘నవంబర్ 18 నాటికి చివరి షెడ్యూల్ పూర్తవుతుందని, డిసెంబర్ 1న డిస్కోరాజా టీజర్ రిలీజ్ చేస్తాం’ అని మేకర్స్ తెలియజేసారు. 
 

సంబంధిత వర్గం
రవితేజ 'క్రాక్' పోస్టర్ అవుట్...
రవితేజ 'క్రాక్' పోస్టర్ అవుట్...
బాబీ సింహా ఫస్ట్ లుక్ రిలీజ్...
బాబీ సింహా ఫస్ట్ లుక్ రిలీజ్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.